News July 30, 2024

AR సిబ్బంది సంక్షేమానికి చర్యలు: ఎస్పీ

image

ఏ.ఆర్ పోలీస్ సిబ్బంది సంక్షేమానికి తగిన చర్యలు చేపట్టాలని జిల్లా SP హర్షవర్ధన్ రాజు AR పోలీస్ అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏ.ఆర్ పోలీస్ అధికారులతో మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. పారదర్శకంగా విధులు నిర్వర్తించాలని ఆదేశించారు. గార్డు విధులు, ఎస్కార్ట్ విధులు, వ్యక్తిగత భద్రతా అధికారుల (పి.ఎస్.ఓ) నిర్వహించే సిబ్బంది వివరాలు ఏ.ఆర్ అదనపు SP కృష్ణారావును అడిగి తెలుసుకున్నారు.

Similar News

News December 16, 2025

కడప జిల్లాకు జోన్-5 కేటాయింపు

image

APలోని 26 జిల్లాలను జోన్‌‌ల వారీగా విభజించే క్రమంలో కడప జిల్లాను జోన్-5 పరిధిలోకి ప్రభుత్వం కేటాయించింది. ఈ మేరకు తాజాగా మంగళవారం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఉద్యోగ నియామకాల నిర్వహణ సులభతరం చేయడం, పరిపాలనా సమన్వయం మెరుగుపర్చే లక్ష్యంతో ప్రభుత్వం జోన్ విధానాన్ని అమలుచేస్తోంది. ఈ విధానంలో చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, కడప జిల్లాలకు మల్టీ జోన్-2లో జోన్-5గా చోటుదక్కింది.

News December 16, 2025

ప్రొద్దుటూరు మున్సిపల్ ఉద్యోగి సస్పెన్షన్.!

image

ప్రొద్దుటూరు మున్సిపల్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఓబులేసును సస్పెండ్ చేశారు. ఈ మేరకు మున్సిపల్ కమిషనర్ రవిచంద్రారెడ్డి ఉత్తర్వులు ఇచ్చారు. మున్సిపల్ చైర్ పర్సన్ సీసీగా, అజెండా క్లర్క్‌గా ఓబులేసు విధులు నిర్వహిస్తున్నాడు. పెట్రోల్ బంకులో జరిగిన అక్రమాలపై అక్కడి మేనేజర్ ప్రవీణ్‌పై కమిషనర్ చర్యలకు ఉపక్రమించారు. ఆ మేరకు ఉన్నతాధికారులకు రిపోర్ట్ పంపారు.

News December 16, 2025

కడప జిల్లాలో దుమారం రేపిన CIల బదిలీలు.!

image

కడప జిల్లాలో CIల బదిలీలపై కూటమి ప్రజా ప్రతినిధులు మండిపడుతున్నారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల ముందు తమను సంప్రదించకుండా సీఐల బదిలీలు చేశారంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యేల ప్రమేయం లేకుండానే ప్రొద్దుటూరు, ముద్దనూరు, కమలాపురానికి కొత్త సీఐలను నియమించారని దీనిపై ప్రొద్దుటూరు MLA వరద మండిపడుతున్నారు. CMOకు ఫిర్యాదు చేయడానికి ఆయన అమరావతికి వెళ్లినట్లు తెలుస్తోంది.