News September 30, 2024

హైకోర్టును ఆశ్రయించిన ఏఆర్ డెయిరీ ఎండీ

image

AP: తిరుమల లడ్డూ వివాదంలో ముందస్తు బెయిల్ కోరుతూ ఏఆర్ డెయిరీ ఎండీ రాజశేఖరన్ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. కల్తీ నెయ్యిని సరఫరా చేశారంటూ TTD ఫిర్యాదు చేయడంతో ఆయనపై కేసు నమోదైంది. అయితే శాంపిల్స్ సేకరణ, దాన్ని విశ్లేషించడంలో అధికారులు నిబంధనలు పాటించలేదని రాజశేఖరన్ పిటిషన్‌లో పేర్కొన్నారు. అరెస్ట్ సహా తొందరపాటు చర్యలు తీసుకోవద్దని కోరారు. బెయిల్ మంజూరులో ఎలాంటి షరతులు విధించినా కట్టుబడి ఉంటానన్నారు.

Similar News

News November 7, 2025

గుంటూరులో గంజాయి ముఠా అరెస్ట్

image

గుంటూరులో గంజాయి సేవించడంతో పాటు విక్రయిస్తున్న మైనర్‌తో సహా ఏడుగురు యువకులను నగరంపాలెం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి ₹30 వేల నగదు, 3 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. జెడ్పీ వద్ద ఖాళీ స్థలంలో గంజాయి కలిగి ఉన్నట్లు సమాచారం అందడంతో ఈ అరెస్టులు చేసినట్లు డీఎస్పీ అరవింద్ తెలిపారు.

News November 7, 2025

జీపీఎస్ స్పూఫింగ్ అంటే?

image

GPS స్పూఫింగ్ అనేది ఒక సైబర్ అటాక్. GPS సిగ్నల్‌‌లను మానిప్యులేట్ చేసి నావిగేషన్ వ్యవస్థలను తప్పుదారి పట్టిస్తారు. ఇలా ఫేక్ శాటిలైట్ సిగ్నల్‌లను ప్రసారం చేయడంతో విమానాలు ఫాల్స్ రూట్లలో వెళ్లే అవకాశముంది. ఓ చోట ఉన్న ఫ్లైట్ మరో చోట ఉన్నట్లు చూపిస్తుంది. దీని వల్ల ఫ్లైట్స్ టేకాఫ్/ల్యాండింగ్ అయ్యేటప్పుడూ ప్రమాదాలకు ఆస్కారముంటుంది. <<18227103>>ఢిల్లీ<<>>, ముంబైలో విమాన సేవల అంతరాయానికి ఇదే కారణమనే అనుమానాలున్నాయి.

News November 7, 2025

ప్రేమికుడిపై కక్షతో ఫేక్ మెయిల్స్… చివరకు జైలు

image

ప్రేమ విఫలమైన ఓ యువతి ప్రేమికుడి పేరిట ఫేక్ బాంబు బెదిరింపు మెయిల్స్ పంపి కటకటాల పాలైంది. రోబోటిక్ ఇంజినీర్ రెనా జోషిల్డా(గుజరాత్‌) ప్రభాకర్ అనే సహచరుడిని ప్రేమించింది. అయితే ఆయన మరో పెళ్లి చేసుకోగా కక్షగట్టింది. ఆయన వర్చువల్ నంబర్‌తో అనేక రాష్ట్రాల స్కూళ్లు, కోర్టులు, స్టేడియాల్ని పేల్చేస్తున్నట్లు రెనా మెయిల్స్ పంపింది. 21 ప్రాంతాల్లో పోలీసులను పరుగులు పెట్టించి చివరకు బెంగళూరులో అరెస్టైంది.