News November 24, 2024
లీగల్ నోటీసులు పంపిన ఏఆర్ రెహమాన్

తన భార్యతో విడాకులపై తప్పుడు ప్రచారం చేస్తున్న మాధ్యమాలకు మ్యూజిక్ డైరెక్టర్ AR రెహమాన్ లీగల్ నోటీసులు పంపారు. తనను, తన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకొని అభ్యంతరకరమైన కంటెంట్‌ను వ్యాప్తి చేసిన వారు 24 గంట్లలోపు వాటిని తొలగించాలన్నారు. రెహమాన్‌తో కలిసి పనిచేసిన బాసిస్ట్ మోహినిడే కూడా తన భర్తతో విడాకులు తీసుకోవడంతో వీరిద్దరూ కలుస్తున్నట్టు వార్తలొచ్చాయి.
Similar News
News November 15, 2025
రాష్ట్రంలో 60 పోస్టులు

తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్(<
News November 15, 2025
బహిరంగ ప్రకటన లేకుండా గిఫ్ట్ డీడ్.. పరకామణిలో చోరీపై సీఐడీ

AP: పరకామణిలో చోరీ కేసులో నిందితుడు రవికుమార్ టీటీడీకి ఇచ్చిన గిఫ్ట్ డీడ్‌పై బహిరంగ ప్రకటన ఎందుకు ఇవ్వలేదని జేఈవో వీరబ్రహ్మంను సీఐడీ ప్రశ్నించింది. టీటీడీకి రూ.14.43 కోట్ల విలువైన ఆస్తులను నిందితుడు గిఫ్ట్ డీడ్‌గా ఇచ్చారు. ఇష్టప్రకారమే ఇచ్చారా? ఒత్తిడి చేశారా అని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని పట్టుకున్నప్పుడు ఎన్ని నోట్లు దొరికాయి, ఆరోజు లెక్కింపునకు వచ్చిన భక్తుల వివరాలు సేకరిస్తున్నారు.
News November 15, 2025
స్వామి పుష్కరిణి అని పేరెందుకు వచ్చింది?

తిరుమలలోని స్వామి పుష్కరిణికి ఆ పేరు రావడానికి ఓ పురాణ కథనం ప్రాచుర్యంలో ఉంది. వేంకటాచలంలో ఉన్న మూడు కోట్ల తీర్థాలన్నింటికీ ఈ పుష్కరిణియే అవతార స్థానం. లోకంలోని తీర్థాలన్నింటిలోనూ దీన్ని స్వామి వంటిదిగా పరిగణిస్తారు. వరాహ, వామన పురాణాల ప్రకారం.. తనలో స్నానం చేసిన వారికి రాజ్యాధికారాన్ని ప్రసాదించగల శక్తి, పవిత్రతను అందిస్తుందట. అందుకే దీనికి స్వామి పుష్కరిణి అనే పేరు స్థిరపడింది. <<-se>>#VINAROBHAGYAMU<<>>


