News November 20, 2024
ఏఆర్ రెహమాన్ శిష్యురాలు కూడా విడాకులు

రెహమాన్-సైరా బాను దంపతులు <<14657136>>విడాకులు<<>> ప్రకటించిన కొన్ని గంటల్లోనే ఆయన మ్యూజిక్ టీమ్‌లోని గిటారిస్ట్ మోహిని డే(29) కూడా భర్త మార్క్‌కు డివోర్స్ ఇచ్చారు. పరస్పర అంగీకారంతోనే విడిపోతున్నామని తెలిపారు. బెస్ట్ ఫ్రెండ్స్‌గా ఉంటామని, కలిసే ప్రాజెక్టులు చేస్తామని ప్రకటించారు. రెహమాన్‌తో కలిసి మోహిని 40+ షోలలో ప్రదర్శన ఇచ్చారు. ఒకేసారి ఇద్దరూ తమ భాగస్వాముల నుంచి వేరుపడటం అనుమానాలకు తావిస్తోంది.
Similar News
News November 28, 2025
మెట్రో ప్రయాణికులకు స్మార్ట్ లాకర్ల సేవలు

L&T మెట్రో రైల్, TUCKITతో కలిసి HYDలోని మెట్రో స్టేషన్లలో స్మార్ట్ స్టోరేజ్ లాకర్ల సేవలను ప్రారంభించింది. ఇందులో లగేజీ, హెల్మెట్లు, షాపింగ్ బ్యాగ్‌లను భద్రపరుచుకుని హ్యాండ్స్‌ఫ్రీగా ప్రయాణించొచ్చు. QR కోడ్ స్కాన్ చేసి, లాకర్ సైజు ఎంచుకుని 30 సెకన్లలో డిజిటల్ పేమెంట్ చేయొచ్చు. మియాపూర్, అమీర్‌పేట్, పంజాగుట్ట, ఎల్బీనగర్, ఉప్పల్, పరేడ్ గ్రౌండ్, హైటెక్‌సిటీ స్టేషన్లలో ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి.
News November 28, 2025
గొర్రెల్లో బొబ్బ రోగం(అమ్మతల్లి) ఎలా గుర్తించాలి?

ఇది ఏడాదిలో ఏ కాలంలోనైనా, ఏ ప్రాంతాల్లో గొర్రెలకైనా సోకే అంటువ్యాధి. ఇది సోకిన గొర్రెలు ఆకస్మికంగా నీరసంగా మారతాయి. శరీర ఉష్ణోగ్రత పెరిగి కళ్లు ఎర్రబడి నీరు కారతాయి. వ్యాధి సోకిన 1,2 రోజుల్లో గొర్రె శరీర భాగాలపై దద్దుర్లు ఏర్పడి క్రమేణా పెద్దవై, బొబ్బలుగా మారి చీము పట్టి నలుపు రంగులోకి మారతాయి. వ్యాధి తీవ్రత బట్టి సుమారు 20-30% గొర్రెలు మరణిస్తాయి. ఈ లక్షణాలను గుర్తించిన వెంటనే చికిత్స అందించాలి.
News November 28, 2025
తిరుమల శ్రీవారి పుష్పాలను ఏం చేస్తారో తెలుసా?

తిరుమల శ్రీవారి సేవ కోసం రోజుకు కొన్ని వందల కిలోల పూలు వాడుతారు. మరి వాటిని ఏం చేస్తారో మీకు తెలుసా? పూజ తర్వాత వాటిని బయట పడేయరు. తిరుపతికి తరలిస్తారు. అక్కడ శ్రీ పద్మావతి అమ్మవారి ఉద్యానవనంలోని పూల ప్రాసెసింగ్ యూనిట్‌కు పంపుతారు. ఈ యూనిట్లో ఈ పూల నుంచి పరిమళభరితమైన అగరబత్తులు, ఇతర సుగంధ ద్రవ్యాలను తయారుచేస్తారు. తద్వారా పూల పవిత్రతను కాపాడుతూనే, వాటిని ఉపయోగకరమైన ఉత్పత్తులుగా మారుస్తారు.


