News March 11, 2025
అరకు కాఫీకి ప్రత్యేక స్థానం: రామ్మోహన్ నాయుడు

AP: ప్రపంచవ్యాప్తంగా ఉన్న కాఫీ ఉత్పత్తుల్లో అరకు కాఫీకి ప్రత్యేక స్థానం ఉందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. అరకు కాఫీ ప్రాముఖ్యత తెలిసేలా పార్లమెంట్ వద్ద ప్రచార కార్యక్రమం ఏర్పాటుకు అనుమతించాలని ఆయన స్పీకర్ ఓంబిర్లాను కోరారు. అరకు కాఫీని ప్రధాని నరేంద్ర మోదీ కూడా మెచ్చుకున్నారని తెలిపారు. అరకు వ్యాలీ ఈ పంటకు ప్రసిద్ధి అని ఆయన వ్యాఖ్యానించారు.
Similar News
News November 15, 2025
లక్నోకు అర్జున్, షమీ.. DCకి నితీశ్ రాణా

ఐపీఎల్ రిటెన్షన్ గడువు నేటితో ముగుస్తుండటంతో ఫ్రాంచైజీలు ఆటగాళ్లను ట్రేడ్ చేస్తున్నాయి. ముంబై ఇండియన్స్ నుంచి సచిన్ కొడుకు అర్జున్ టెండూల్కర్ లక్నోకు వెళ్లారు. సన్‌రైజర్స్ బౌలర్ షమీ కూడా LSG జట్టులో చేరారు. అటు రాజస్థాన్ రాయల్స్‌ను వీడిన నితీశ్ రాణా ఢిల్లీ క్యాపిటల్స్‌లో చేరారు. KKR ప్లేయర్ మయాంక్ మార్కండేను ముంబై ట్రేడ్ చేసుకుంది.
News November 15, 2025
సెంచరీ కోసం నిరీక్షణ! అప్పుడు విరాట్.. ఇప్పుడు బాబర్

2019 నవంబర్ 23న సెంచరీ చేసిన విరాట్.. మరో సెంచరీ కోసం దాదాపు రెండున్నరేళ్లు నిరీక్షించారు. 2022, సెప్టెంబర్ 8న అఫ్గానిస్థాన్‌పై శతకదాహం తీర్చుకున్నారు. తాజాగా పాకిస్థానీ బ్యాటర్ బాబర్ ఆజమ్ అదే పరిస్థితిని ఎదుర్కొన్నారు. 2023, ఆగస్టు 30న సెంచరీ చేసిన బాబర్.. 807 రోజుల తర్వాత మరో సెంచరీ చేశారు. నిన్న శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో అజేయ సెంచరీ సాధించి సుదీర్ఘ సెంచరీ నిరీక్షణకు తెరదించారు.
News November 15, 2025
సమూల ప్రక్షాళన దిశగా KCR అడుగులు!

TG: 2023 అసెంబ్లీ ఎన్నికల నుంచి జూబ్లీహిల్స్ బై పోల్ వరకూ BRS వరుస ఓటములతో సతమతమవుతోంది. పరిస్థితి ఇలాగే ఉంటే వచ్చే GHMC ఎన్నికల్లోనూ పార్టీకి నష్టం చేకూరే అవకాశముంది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ చీఫ్ KCR సమూల మార్పుల దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు అడ్‌హక్ కమిటీలతో పార్టీని నడిపిన ఆయన.. త్వరలోనే రాష్ట్రస్థాయి వరకూ కొత్త నాయకత్వాన్ని బలోపేతం చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.


