News July 2, 2024

అరకు కాఫీకి ఈ గుర్తింపు రావడం సంతోషకరం: CBN

image

అరకులో కాఫీ పండిస్తున్న గిరిజన రైతులకు మద్దతిస్తున్నందుకు PM <<13539131>>మోదీ<<>>, ఏపీ సీఎం CBNకు వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా ధన్యవాదాలు తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ కాఫీకి గుర్తింపు ఉందని, ప్యారిస్‌లో రెండో కేఫ్‌ను ప్రారంభించనున్నట్లు Xలో తెలిపారు. దీనిని AP CM చంద్రబాబు స్పందిస్తూ అరకు కాఫీకి ప్రపంచ గుర్తింపు రావడం సంతోషకరమన్నారు. భవిష్యత్తులో మరిన్ని విజయగాథలు AP నుంచి రావాలని CBN ఆకాంక్షించారు.

Similar News

News December 1, 2025

₹50వేల కోట్ల దావా.. AERA పక్షాన కేంద్రం!

image

ఢిల్లీ, ముంబై విమానాశ్రయాల ప్రైవేట్ ఆపరేటర్లు, ఎయిర్‌పోర్ట్స్ ఎకనామిక్ రెగ్యులేటరీ అథారిటీ (AERA) ఆఫ్ ఇండియా మధ్య ₹50వేల కోట్ల దావా SCకు చేరింది. ఇందులో కేంద్రం AERA పక్షాన నిలిచింది. రెగ్యులేటెడ్ సర్వీసెస్ కోసం కాలిక్యులేట్ చేసే అసెట్స్ క్యాపిటల్ వ్యాల్యూపై విభేదాలున్నాయి. ఆపరేటర్లు గెలిస్తే ఢిల్లీ ఎయిర్‌పోర్టులో యూజర్ డెవలప్మెంట్ ఫీజు ₹129 నుంచి ₹1261కి, ముంబైలో ₹175 నుంచి ₹3,856కు పెరుగుతుంది.

News December 1, 2025

భార్య పదవిని భర్త అనుభవిస్తే వేటు తప్పదు!

image

తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలు జరగనున్నాయి. మహిళా రిజర్వేషన్ ఉన్నచోట్ల భర్తలు తమ భార్యలతో నామినేషన్ వేయించారు. కొన్నిచోట్ల భార్యలను ఇంటికి పరిమితం చేసి వారి పదవిని భర్తలు అనుభవిస్తుంటారు. ఇలా చేయడం రిజర్వేషన్ల ప్రధాన ఉద్దేశమైన మహిళా సాధికారతకు ఆటంకం కలిగించడమే. ఎన్నికైన మహిళా సర్పంచ్ అధికారాలను ఆమె భర్త అనుభవిస్తే అది అధికారాల దుర్వినియోగంగా గుర్తించి పదవిలో నుంచి తొలగించే అవకాశం ఉంది. SHARE IT

News December 1, 2025

13,217 పోస్టులు.. అడ్మిట్ కార్డులు విడుదల

image

రీజినల్ రూరల్ బ్యాంకుల్లో 13,217 పోస్టుల భర్తీకి సంబంధించి ప్రిలిమినరీ పరీక్షల అడ్మిట్ కార్డులను IBPS విడుదల చేసింది. అభ్యర్థులు రిజిస్ట్రేషన్ నంబర్, పాస్ వర్డ్ ఎంటర్ చేసి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. డిసెంబర్ 6, 7, 13, 14 తేదీల్లో ఆన్‌లైన్‌లో పరీక్షలు జరుగుతాయి. కాగా ప్రస్తుతం ఉచిత మాక్ టెస్టులు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి.
వెబ్‌సైట్: https://www.ibps.in/