News March 18, 2025
అసెంబ్లీ ఆవరణలో అరకు కాఫీ స్టాల్ ప్రారంభం

AP: అసెంబ్లీ ఆవరణలో అరకు కాఫీ స్టాల్‌ను స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. కాఫీ ఉత్పత్తులను పరిశీలించిన అనంతరం చంద్రబాబు స్వయంగా పవన్‌కు కాఫీ అందించారు. దీంతో అక్కడున్నవారంతా చిరునవ్వులు చిందించారు. కాగా <<15795599>>పార్లమెంటులోనూ<<>> అరకు కాఫీ స్టాల్స్ ఏర్పాటుకు ఆమోదం లభించింది.
Similar News
News March 18, 2025
పెద్ద దేవళాపురం@42.7 డిగ్రీలు

AP: ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా ఎండలు దంచికొట్టాయి. నంద్యాల జిల్లా పెద్ద దేవళాపురంలో అత్యధికంగా 42.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఉలిందకొండలో 42.6, ఖాజీపేటలో 41.8, దరిమడుగులో 41.5, నాగసముద్రం, వత్తలూరులో 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. చాలా ప్రాంతాల్లో 40 డిగ్రీల పైనే నమోదవడం గమనార్హం. అలాగే 7 మండలాల్లో తీవ్ర వడగాలులు, 42 మండలాల్లో వడగాలులు వీచాయని APSDMA వెల్లడించింది.
News March 18, 2025
వ్యోమగాముల గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు

వ్యోమగాములు అనారోగ్యానికి గురైతే చికిత్స అందించేందుకు టీమ్‌లో ఒక మెడికల్ ఆఫీసర్ ఉంటారు. అతనికి ప్రాథమిక చికిత్స, ఇంజెక్షన్లు ఇవ్వడం, గాయాలకు కుట్లు వేయడంపై శిక్షణ ఇస్తారు. ISSలోనే మెడికల్ కిట్ ఉంటుంది. అలాగే అక్కడి టాయిలెట్స్ కూడా భిన్నంగా ఉంటాయి. అందులో వాటర్ గన్‌కు బదులు వాక్యూమ్ క్లీనర్ ఉంటుంది. వ్యర్థాలు గాల్లో తేలియాడకుండా ఇది పీల్చుకుంటుంది. గొట్టంలాంటి వాక్యూమ్‌ను టాయిలెట్‌కు వాడతారు.
News March 18, 2025
చేనేత కార్మికుల ఇంటి నిర్మాణానికి రూ.50,000: సీఎం

AP: చేనేత కార్మికుల ఇళ్లకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని CM చంద్రబాబు తెలిపారు. దీంతో 93వేల మంది చేనేతకారులకు, 10,534 మరమగ్గాల యజమానులకు లబ్ధి చేకూరుతుందని వెల్లడించారు. చేనేత కార్మికుల ఇంటి నిర్మాణానికి ₹50,000 సాయం చేస్తామని ప్రకటించారు. అలాగే వారికి GST రీయింబర్స్‌మెంట్ అమలు చేస్తామన్నారు. ప్రభుత్వ సహకారంతో నేతన్నలు వృద్ధిలోకి రావాలని ఆకాంక్షించారు.