News March 17, 2025

పార్లమెంట్, అసెంబ్లీ ప్రాంగణాల్లో అరకు కాఫీ స్టాల్స్

image

పార్లమెంటు, AP అసెంబ్లీ ప్రాంగణాల్లో అరకు కాఫీ స్టాల్స్ ఏర్పాటు కానున్నాయి. స్పీకర్ ఓం బిర్లా అనుమతించిన నేపథ్యంలో నేటి నుంచి పార్లమెంటు ప్రాంగణంలో స్టాళ్లను ప్రారంభిస్తున్నామని గిరిజన సహకార సంస్థ అధికారులు వెల్లడించారు. ప్రధాని మోదీ సహా కేంద్ర మంత్రులందరికీ ప్రత్యేక గిఫ్ట్ ప్యాక్‌లను ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇక AP అసెంబ్లీ ప్రాంగణంలో మరో రెండు రోజుల్లో స్టాల్స్ ఏర్పాటయ్యే అవకాశం ఉంది.

Similar News

News March 17, 2025

విషాదం: అమెరికాలో ముగ్గురు తెలంగాణవాసుల మ‌ృతి

image

TG: రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలానికి చెందిన ముగ్గురు అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. టేకులపల్లి మాజీ సర్పంచ్ మోహన్ రెడ్డి కుమార్తె ప్రగతి రెడ్డి(35), మనవడు హార్వీన్(6), ప్రగతి రెడ్డి అత్త సునీత(56)గా గుర్తించారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు కన్నుమూయడం టేకులపల్లిలో విషాదాన్ని నింపింది.

News March 17, 2025

డీఎంకే లక్ష్యంగా బీజేపీ ఆందోళనలు

image

తమిళనాడులో డీఎంకే సర్కార్ టార్గెట్‌గా బీజేపీ ఆందోళనలకు దిగింది. మద్యం దుకాణాల ముట్టడికి బీజేపీ పిలుపునివ్వగా పార్టీ చీఫ్ అన్నామలై సహా కీలక నేతలు హౌస్ అరెస్టయ్యారు. లిక్కర్ అమ్మకాల ద్వారా డీఎంకేకు రూ.1000 కోట్లు ముట్టాయని బీజేపీ ఆరోపణలకు పాల్పడుతోంది. రూపీ(₹) సింబల్ పేరుతో డీఎంకే నేతలు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

News March 17, 2025

RECORD: FY25లో ₹1.75 లక్షల కోట్ల ఫోన్లు ఎగుమతి

image

భారత్ సరికొత్త రికార్డు సృష్టించింది. FY25 తొలి 11 నెలల్లోనే రూ.1.75లక్షల కోట్ల ($21B) విలువైన మొబైల్ ఫోన్లను ఎగుమతి చేసింది. IT మినిస్టర్ అశ్వినీ వైష్ణవ్ అంచనా వేసిన $20Bతో పోలిస్తే ఇది ఎక్కువే. FY24లో ఎగుమతి చేసిన $15.6Bతో చూస్తే ఏకంగా 54% ఎక్కువ. భారత్ నుంచి అమెరికా, బ్రిటన్, UAE, నెదర్లాండ్స్‌కు యాపిల్, శామ్‌సంగ్ మొబైళ్లు ఎగుమతి అవుతున్నాయి. అందులో USకే 50% కన్నా ఎక్కువ వెళ్తున్నాయి.

error: Content is protected !!