News June 7, 2024

‘నోటా’ ఓట్లలో దేశంలోనే అరకు రెండో ప్లేస్

image

AP: మంగళవారం వెలువడిన ఫలితాల్లో అరకు లోక్‌సభ స్థానానికి ఏకంగా 50,470 ‘నోటా’ ఓట్లు పడ్డట్లు తేలింది. ఇవి అక్కడ పోలైన ఓట్లలో 4.33శాతం కాగా నోటాకు అత్యధికంగా వచ్చిన ఓట్లలో దేశంలోనే అరకు రెండో స్థానంలో నిలిచింది. 2,18,674 ఓట్లతో మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌ తొలి స్థానంలో ఉంది. ఇక రాష్ట్రంలో అత్యల్పంగా విశాఖ లోక్‌సభ స్థానానికి 5,313 నోటా ఓట్లు పడ్డాయి.

Similar News

News November 29, 2024

PIC OF THE DAY: ప్రధానితో క్రికెటర్లు

image

ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్‌తో టీమ్ ఇండియా క్రికెటర్లు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కాన్‌బెర్రా పార్లమెంట్ వద్ద ప్రధానితో భారత ఆటగాళ్లు గ్రూప్ ఫొటో తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా ఎల్లుండి నుంచి ప్రైమ్ మినిస్టర్ XIతో భారత్ వార్మప్ మ్యాచ్ ఆడనుంది. డిసెంబర్ 6 నుంచి అడిలైడ్‌లో రెండో టెస్టు జరగనుంది.

News November 29, 2024

కానిస్టేబుల్ అభ్యర్థులకు శుభవార్త

image

APలో కానిస్టేబుల్ అభ్యర్థులకు పోలీస్ నియామక మండలి శుభవార్త చెప్పింది. ఫిజికల్ టెస్టులకు సంబంధించి స్టేజ్-2 కోసం దరఖాస్తుల స్వీకరణ గడువును డిసెంబర్ 6వ తేదీ వరకు పొడిగించింది. గతంలో విధించిన గడువు ఇవాళ్టితో ముగిసిన నేపథ్యంలో మళ్లీ పొడిగించింది. DEC చివరి వారంలో PMT, PET టెస్టులు జరగనున్నాయి. అభ్యర్థులకు సందేహాలుంటే 9441450639, 9100203323 నంబర్లను సంప్రదించండి. దరఖాస్తు చేసేందుకు ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.

News November 28, 2024

ఫలితాలు విడుదల

image

TG: పాలిటెక్నిక్ లెక్చరర్ ఉద్యోగాలకు ఎంపికైన వారి జాబితాను TGPSC విడుదల చేసింది. ఈసీఈ, ఈఐఈ, అర్కిటెక్చర్ ఇంజినీరింగ్, కెమిస్ట్రీ, ఫిజిక్స్, లెక్చరర్ ఇన్ లెటర్ ప్రెస్ వంటి పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను వెబ్‌సైటులో పొందుపరిచింది. ఫలితాల కోసం ఇక్కడ <>క్లిక్ <<>>చేయండి.