News March 16, 2024

అరకు ఎంపీ వైసీపీ అభ్యర్థిగా డాక్టర్

image

అరకు పార్లమెంట్ వైసీపీ అభ్యర్థిగా చెట్టి తనూజారాణికి టిక్కెట్ కేటాయిస్తూ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది. ఎంబీబీఎస్ పూర్తి చేసిన తనూజారాణికి అరకు ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ కుమారుడు వినయ్‌తో రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. తనూజారాణి తండ్రి శ్యాం సుందర్ హుకుంపేట మండలం అడ్డుమండ సర్పంచ్. తనూజారాణికి ఎంపీ కేటాయింపుతో మూడు సామాజిక వర్గాలకు న్యాయం చేకూరిందని పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News October 30, 2025

VZM: జిల్లా కలెక్టర్, యంత్రాంగాన్ని అభినందించిన సీఎం చంద్రబాబు

image

మొంథా తుఫాన్ సమయంలో సమయస్ఫూర్తితో, సమన్వయంతో వ్యవహరించి ప్రాణ నష్టం లేకుండా చర్యలు తీసుకున్నందుకు జిల్లా కలెక్టర్ రాంసుందర్ రెడ్డి, జిల్లా యంత్రాంగాన్ని సీఎం చంద్రబాబు బుధవారం నిర్వహించిన వీసీలో అభినందించారు. తుఫాన్ సమయంలో గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది చూపిన అంకితభావాన్ని సీఎం ప్రశంసించారు. కలెక్టర్ రాంసుందర్ రెడ్డి ఈ సందర్భంగా సీఎం అభినందనలకు ధన్యవాదాలు తెలిపారు.

News October 29, 2025

VZM: ‘రేపటి నుంచి యథావిధిగా పాఠశాలలు’

image

మొంథా తుఫాన్ కారణంగా మూడు రోజులుగా మూసివేసిన పాఠశాలలను రేపటి నుంచి యథావిధిగా ప్రారంభించాలని జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ) మాణిక్యాల నాయుడు ఆదేశించారు. తుఫాన్ ప్రభావం తగ్గుముఖం పట్టడంతో పాఠశాలలను పునఃప్రారంభించాలని మండల అధికారులు, హెచ్ఎంలకు సూచించారు. ఈ మేరకు విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వాలని కోరారు.

News October 29, 2025

విజయనగరం కలెక్టర్ కీలక ఆదేశాలు

image

జిల్లాలో తుఫాన్ కారణంగా జరిగిన నష్టాల అంచనాలను తక్షణం పంపించాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి అధికారులకు బుధవారం ఆదేశించారు. శాఖలవారీగా నిజమైన వివరాలు, ఫొటోలు సహా అంచనాలు పంపాలని సూచించారు. మత్స్యకారులకు ప్రభుత్వం ప్రకటించిన 50 కేజీల బియ్యం సహాయాన్ని వెంటనే అందించాలని మత్స్యశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. క్షేత్రస్థాయిలో 24 గంటలు కృషి చేసిన అధికారులు, సచివాలయ సిబ్బందిని అభినందించారు.