News April 4, 2024
‘తెలంగాణ భవన్’లో వాస్తు మార్పులు

TG: అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, నేతల వలసలు పెరగడంతో BRS వాస్తు మార్పులకు శ్రీకారం చుట్టింది. బంజారాహిల్స్‌లోని BRS కేంద్ర కార్యాలయమైన ‘తెలంగాణ భవన్’లో వాస్తు మార్పులు చేయాలని నిర్ణయించారు. వాయవ్య దిశలో ఉన్న గేటు నుంచి కాకుండా ఈశాన్యంలోని గేటు నుంచి రాకపోకలు సాగించాలని డిసైడ్ అయ్యారు. ఇందులో భాగంగా వాహనాల కోసం ర్యాంపు నిర్మిస్తున్నారు. లోపల కూడా స్వల్ప మార్పులు, చేర్పులు చేస్తున్నారు.
Similar News
News December 16, 2025
NIPERలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, పంజాబ్ (NIPER) 4 కాంట్రాక్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల వారు DEC 24వరకు అప్లై చేసుకోవచ్చు. BE, బీటెక్, B.COM, డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గలవారు అర్హులు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 35ఏళ్లు. వెబ్సైట్: https://niperahmnt.samarth.edu.in
News December 16, 2025
డెలివరీ తర్వాత డిప్రెషన్ తగ్గాలంటే

గర్భం దాల్చినప్పటి నుంచి డెలివరీ అయ్యే వరకు మహిళల శరీరంలో ఎన్నో మార్పులు వస్తాయి. ఈక్రమంలో కొందరు డెలివరీ తర్వాత డిప్రెషన్‌కు లోనవుతున్నారు. ఒత్తిడి, ప్రెగ్నెన్సీలో సమస్యలు, వంశపారంపర్యం వల్ల కూడా కొందరు డిప్రెషన్ బారిన పడతారని వైద్యులు చెబుతున్నారు. పోషకాహారం తీసుకోవడం, సన్నిహితులు, కుటుంబీకులతో ఎక్కువగా గడపడం, సరిపడా నిద్రపోవడం వంటివి చేయాలని సూచిస్తున్నారు. <<-se>>#PregnancyCare<<>>
News December 16, 2025
Fresh Low: మరింత పతనమైన రూపాయి

భారత రూపాయి విలువ మరోసారి చరిత్రలో కనిష్ఠ స్థాయికి చేరింది. మంగళవారం ట్రేడింగ్‌లో అమెరికన్ డాలర్‌తో రూపాయి మారకం విలువ 5 పైసలు క్షీణించి రూ.90.83 వద్ద ఆల్‌టైమ్ కనిష్ఠాన్ని నమోదు చేసింది. సోమవారం 90.78 వద్ద ముగిసిన సంగతి తెలిసిందే. అమెరికాతో వాణిజ్య ఒప్పందం ఆలస్యం, విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ, దిగుమతిదారుల నుంచి డాలర్‌కు పెరిగిన డిమాండ్ రూపాయి బలహీనతకు కారణాలుగా నిపుణులు చెబుతున్నారు.


