News September 21, 2024

బాబు, లోకేశ్ ప్రమాణానికి సిద్ధమా?: అంబటి

image

AP: తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని సీఎం చంద్రబాబు నిరూపించలేదని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ఈ వ్యవహారంపై తిరుమలలో చంద్రబాబు, లోకేశ్‌కు ప్రమాణం చేసే ధైర్యం ఉందా అని ఆయన ప్రశ్నించారు. ‘రాజకీయ ప్రయోజనాల కోసం తిరుమల శ్రీవారిని ఉపయోగించుకుంటున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు 18 సార్లు నెయ్యి ట్యాంకర్లు వెనక్కి పంపాం. కల్తీ నెయ్యి చంద్రబాబు హయాంలోనే వచ్చింది’ అని అంబటి ఆరోపించారు.

Similar News

News September 21, 2024

గవర్నర్‌ను కలిసిన వైఎస్ షర్మిల

image

AP: పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌తో భేటీ అయ్యారు. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని ఆమె గవర్నర్‌ను కోరారు. ఈ కేసును సీబీఐతో విచారణ చేయించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. లడ్డూ కల్తీ బాధ్యులు ఎవరో తేల్చాలని కోరారు.

News September 21, 2024

ఒత్తిడితో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆత్మహత్య!

image

పుణేలో ఓ CA ఒత్తిడితో సూసైడ్ చేసుకున్న ఘటన మరువక ముందే చెన్నైలో కార్తికేయన్ అనే ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్(38) ఆత్మహత్యకు పాల్పడ్డారు. తెనీ ప్రాంతానికి చెందిన ఆయన కుటుంబంతో సహా చెన్నైలో ఉంటున్నారు. వృత్తిపరమైన ఒత్తిడి, డిప్రెషన్‌కు చికిత్స తీసుకుంటున్నారు. తాజాగా కుటుంబీకులెవరూ ఇంట్లోలేని సమయంలో బలవన్మరణానికి పాల్పడ్డారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

News September 21, 2024

కేటీఆర్‌పై పరువు నష్టం దావా వేస్తాం: మంత్రి పొంగులేటి

image

TG: అమృత్ టెండర్ల పంపిణీలో అవినీతి జరిగిందన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ <<14158364>>వ్యాఖ్యలపై<<>> పరువు నష్టం దావా వేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. రూ.8,888 కోట్ల టెండర్లు ఎవరు దక్కించుకున్నారో కేటీఆర్ చెప్పాలన్నారు. తెల్లారితే పోలింగ్ ఉండగా గత ప్రభుత్వమే ప్రత్యేక అనుమతులతో 3 ప్యాకేజీలుగా టెండర్లు పిలిచి పీఎల్ఆర్, మేఘా, గజా కన్‌స్ట్రక్షన్స్‌కు కట్టబెట్టిందన్నారు.