News September 18, 2025
పిల్లలు మొబైల్ / టీవీ చూస్తున్నారా?

పిల్లలు అల్లరి చేయగానే ఫోన్, టీవీ చూపించడం అలవాటు చేస్తున్నారా? ఇది మీ కోసమే. తాజా అధ్యయనం ప్రకారం పిల్లలు ఎక్కువ సేపు స్క్రీన్ చూస్తే గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం పెరుగుతుందని తేలింది. ముఖ్యంగా నిద్ర తక్కువగా ఉన్న పిల్లల్లో ఈ ప్రమాదం మరింత ఎక్కువగా ఉంటుందట. స్క్రీన్ సమయాన్ని తగ్గించడం, సరైన నిద్ర ఉండేలా చూసుకోవడం, శారీరక శ్రమను ప్రోత్సహిస్తే ఈ ప్రమాదం ఉండదని వైద్యులు చెబుతున్నారు.
Similar News
News February 4, 2026
మిరపలో కుకుంబర్ మొజాయిక్ తెగులును ఎలా నివారించాలి?

మిరప పంటను ఆశించే ఈ వైరస్ తెగులు పేనుబంక ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఈ తెగులు సోకిన మొక్కల్లో ఎదుగుదల లోపిస్తుంది. మొక్కలు పొట్టిగా కనిపిస్తాయి. ఆకులు రంగుమారిపోతాయి. మొక్కలకు పూత ఉండదు. ఈ వైరస్ సోకిన మొక్కలను పీకి నాశనం చేయాలి. వ్యాధిని వ్యాప్తి చేసే పేనుబంక నివారణకు ఎసిఫేట్ 1.5 గ్రా. లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.25mlను లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
News February 4, 2026
మేఘాల చాటున చంద్రుడు కలలో కనిపిస్తే..?

కలలో చంద్రుడు మేఘాల వెనుక దాగి ఉన్నట్లు, మాటిమాటికీ మాయమవుతున్నట్లు కనిపిస్తే అది మీ ఆశయ సాధనలో ఎదురయ్యే అడ్డంకులకు సంకేతమని స్వప్న శాస్త్రం చెబుతోంది. మీ కోరికలు నెరవేరకుండా కొన్ని శక్తులు మిమ్మల్ని నిరోధిస్తున్నాయని దీని అర్థం. ఇలాంటి కల వచ్చినప్పుడు నిరుత్సాహపడకూడదు. మీ పని తీరును, వ్యూహాలను మార్చుకోవాలి. మరింత పట్టుదలతో, కష్టపడి పనిచేయాలి. అప్పుడే విజయం మీ సొంతమవుతుంది.
News February 4, 2026
వార్డ్‌రోబ్ నుంచి వాసన వస్తోందా?

దుస్తులు సరిగ్గా ఆరకపోవడం, వార్డ్‌రోబ్ తలుపులు ఎప్పుడూ మూసి ఉంచడం వల్ల అదోరకమైన వాసన వస్తుంది. ఇలా కాకుండా ఉండాలంటే దళసరిగా, పలుచగా ఉండే బట్టలను వేటికవే విడిగా ఉతికి, ఆరేయాలి. నానబెట్టే ముందు సర్ఫ్‌లో కాస్త బేకింగ్ సోడా, నిమ్మరసం కలపాలి. సువాసన కోసం రోజ్ వాటర్ కలిపిన నీటితో జాడించి ఆరేయాలి. వార్డ్‌రోబ్‌లో రోజ్మెరీ, నాఫ్తలీన్ బాల్స్, సిలికా జెల్ ప్యాకెట్స్ పెడితే దుర్వాసన రాకుండా ఉంటుంది.


