News July 5, 2024
కొలెస్ట్రాల్ తగ్గించే ఇంజెక్షన్లు ఇన్సూరెన్స్‌లో కవర్ అవుతాయా?

కొలెస్ట్రాల్ తగ్గించే కాస్ట్లీ ఇంజెక్షన్లు భారత్‌లోనూ రానున్న నేపథ్యంలో ఇవి ఇన్సూరెన్స్ పరిధిలోకి వస్తాయా? లేదా? అనేది చర్చనీయాంశమైంది. ‘కేంద్రం ఆమోదంతో ఈ చికిత్స హెల్త్ ఇన్సూరెన్స్ పరిధిలోకి వచ్చినా ఆస్పత్రి ఖర్చులే కవర్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇంజెక్షన్ ఖర్చును (₹1.25లక్షలు) పేషెంటే భరించాలి. చికిత్సకు ముందు మీ ఇన్సూరర్‌ను సంప్రదించడం లేదా పాలసీ చెక్ చేసుకోవడం మంచిది’ అని నిపుణులు సూచిస్తున్నారు.
Similar News
News November 8, 2025
‘కృష్ణ పక్షం’ అంటే ఏంటి?

క్యాలెండర్లో కొన్ని తిథుల ముందుండే కృష్ణ పక్షం అంటే ఏంటో తెలుసుకుందాం. కృష్ణ పక్షం అంటే.. ప్రతి నెలా పౌర్ణమి తర్వాత, అమావాస్య వరకు ఉండే 15 రోజుల కాలం. ఈ పక్షంలో చంద్రుడి వెన్నెల క్రమంగా తగ్గుతుంది. చంద్రుడు అలా క్షీణిస్తూ పోతాడు కాబట్టి దీన్ని క్షీణ చంద్ర పక్షమని, చీకటి పక్షమని కూడా అంటారు. చీకటి, నలుపును సూచించే ‘కృష్ణ’ను జోడించి కృష్ణ పక్షం అనే పేరొచ్చింది. బహుళ పక్షం అని కూడా వ్యవహరిస్తారు.
News November 8, 2025
ఎయిమ్స్ బిలాస్‌పుర్‌లో 64 ఉద్యోగాలు

ఎయిమ్స్ బిలాస్‌పుర్ 64 సీనియర్ రెసిడెంట్ పోస్టులను భర్తీ చేస్తోంది. అర్హతగల అభ్యర్థులు ఈనెల 12వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి ఎమ్మెస్సీ, ఎండీ, ఎంఎస్, డీఎన్బీ, ఎంసీహెచ్, పీహెచ్డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 45ఏళ్లు. దరఖాస్తు ఫీజు రూ.1,180, SC,STలకు రూ.500. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://www.aiimsbilaspur.edu.in
News November 8, 2025
గొప్ప కృష్ణభక్తుడు ‘కనకదాసు’

AP: ఇవాళ భక్త కనకదాసు జయంతిని రాష్ట్ర పండుగగా ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఈయన అసలు పేరు తిమ్మప్ప నాయకుడు. కర్ణాటకలోని బాడా గ్రామంలో 1509లో జన్మించారు. చిన్నతనం నుంచే శ్రీకృష్ణుడికి పరమ భక్తుడు. సాధారణ ప్రజలకూ అర్థమయ్యేలా ఎన్నో కీర్తనలు, గ్రంథాలను రాశారు. ఈయన జయంతిని సెలవుదినంగా ప్రకటించి కర్ణాటక ప్రభుత్వం పండుగలా నిర్వహిస్తుంది. కురబలు ఎక్కువగా ఉన్న మన రాష్ట్రంలోనూ వేడుకలు ఘనంగా జరుపుతారు.


