News February 10, 2025

క్రిమినల్ కేసులు ఉద్యోగులకేనా.. ప్రజాప్రతినిధులకు కాదా?: సుప్రీం

image

క్రిమినల్ కేసులుంటే ఉద్యోగులుగా చేరేందుకు అనర్హులని, అలాంటప్పుడు ప్రజాప్రతినిధులుగా ఎలా అర్హులవుతారని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఈ విషయంలో ఈసీ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. క్రిమినల్ కేసుల్లో దోషులు తిరిగి ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించాలని దాఖలైన పిటిషన్‌పై జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ మన్‌మోహన్ ధర్మాసనం విచారణ జరిపింది.

Similar News

News December 13, 2025

IIBFలో ఉద్యోగాలు.. దరఖాస్తుకు ఇవాళే లాస్ట్ డేట్

image

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్& ఫైనాన్స్‌(IIBF)లో 17 పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. పోస్టును బట్టి డిగ్రీ (కామర్స్/ఎకనామిక్స్/బిజినెస్ మేనేజ్‌మెంట్/IT/CS/కంప్యూటర్ అప్లికేషన్), డిప్లొమా(IIBF), M.Com/MA/MBA/CA/CMA/CFA, PhD ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్ష, షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: www.iibf.org.in

News December 13, 2025

(PMAY-G)-NTR స్కీమ్.. రేపటి వరకే ఛాన్స్

image

AP: PM ఆవాస్ యోజన గ్రామీణ (PMAY-G)-NTR పథకం దరఖాస్తు గడువు రేపటితో(డిసెంబర్ 14) ముగియనుంది. దరఖాస్తు చేసుకునేందుకు గ్రామ/వార్డు సచివాలయాల్లో సంప్రదించాలని అధికారులు సూచించారు. ఈ పథకం కింద సొంత ఇల్లు లేని పేద కుటుంబాలకు గృహ నిర్మాణం కోసం ₹2.50లక్షల వరకు ఆర్థిక సాయం అందుతుంది. సొంత స్థలం లేని వారికి 3 సెంట్ల స్థలం, ఆర్థికసాయం అందజేస్తారు.

News December 13, 2025

చంద్రబాబుపై ఫైబర్‌నెట్ కేసు కొట్టివేత

image

AP: సీఎం చంద్రబాబుకు భారీ ఊరట కలిగింది. గత ప్రభుత్వ హయాంలో నమోదైన ఫైబర్‌నెట్ కేసును ACB కోర్టు కొట్టేసింది. ఇతర నిందితులకూ క్లీన్‌చిట్ ఇచ్చింది. 2014-19 మధ్య ఫైబర్‌నెట్‌లో ₹114Cr స్కామ్ జరిగిందని కేసు నమోదైన విషయం తెలిసిందే. తాజాగా CID అధికారులు ఆ కేసు దర్యాప్తును ముగించినట్లు కోర్టుకు తెలిపారు. కేసు ఉపసంహరణకు అభ్యంతరం లేదని నాటి, నేటి ఫైబర్‌నెట్ MDలు చెప్పారు. దీంతో కోర్టు తీర్పు వెలువరించింది.