News March 31, 2025
ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు వేడెక్కుతున్నాయా?

వేసవిలో స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లు, ల్యాప్ టాప్‌లు వాడితే త్వరగా వేడెక్కే అవకాశం ఉంది. ACలు లేని చోట్ల వీటిని చల్లగా ఉంచేందుకు పలు చిట్కాలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎలక్ట్రానిక్ పరికరాన్ని ఉపయోగించాక వెంటిలేషన్ ఉన్న ప్రదేశంలో ఉంచాలి. గోడకు అంటిపెట్టకుండా సూర్యకాంతి పడకుండా చూసుకోవాలి. ఒకదానిపై ఒకటి ఉంచకూడదు. వేడెక్కిందని అనిపిస్తే కాసేపు వాడకం ఆపేసి చల్లగా అయ్యాక ఉపయోగించడం ఉత్తమం.
Similar News
News January 14, 2026
సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ వాయిదా

ఇవాళ విడుదల కావాల్సిన సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ 2026 నోటిఫికేషన్‌ను <
News January 14, 2026
వచ్చే నెల 17 నుంచి టెన్త్ ప్రీఫైనల్ ఎగ్జామ్స్

AP: టెన్త్ విద్యార్థులకు ఫిబ్రవరి 17వ తేదీ నుంచి 24వ తేదీ వరకు ప్రీఫైనల్ ఎగ్జామ్స్ జరగనున్నాయి. ఉదయం 9.30గంటల నుంచి మధ్యాహ్నం 12.30గంటల వరకు పరీక్షలు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. వీటి అనంతరం గ్రాండ్ టెస్ట్, పబ్లిక్ పరీక్షలు ఉండనున్నాయి. మరోవైపు సంక్రాంతి సందర్భంగా ఈ నెల 10 నుంచి 18 వరకు స్కూళ్లకు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే.
News January 14, 2026
CUSBలో 84 పోస్టులు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ సౌత్ బిహార్(CUSB)లో 84 టీచింగ్(62), నాన్ టీచింగ్(22) పోస్టుల కు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. పోస్టును బట్టి టెన్త్, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, సంబంధిత విభాగంలో పీజీ, PhD, M.Ed, NET/SLET/SET, LLM, M.Tech, MBBS, M.LSc ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వెబ్‌సైట్: https://www.cusb.ac.in


