News August 25, 2024

‘హైడ్రా’ నెక్ట్స్ టార్గెట్ వారేనా?

image

అక్రమ నిర్మాణాలపై కొరడా ఝుళిపిస్తున్న హైడ్రా నిన్న హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్‌ను నేలమట్టం చేసింది. దీని తర్వాతి టార్గెట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డేనని తెలుస్తోంది. హైదరాబాద్ శివారులో మల్లారెడ్డి కాలేజీని చెరువులోనే నిర్మించారంటూ హైడ్రాకు భారీగా ఫిర్యాదులొస్తున్నాయి. అటు పల్లాకు చెందిన అనురాగ్ కాలేజీ కూడా అక్రమ నిర్మాణమేనని ఆరోపణలున్నాయి.

Similar News

News March 24, 2026

ఎస్సీ అభివృద్ధి నిధులను పూర్తిస్థాయిలో వినియోగించాలి: కలెక్టర్

image

ఖమ్మం: షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి కోసం కేటాయించిన నిధులను ప్రణాళికాబద్ధంగా ఖర్చు చేయాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. వ్యవసాయ, ఉద్యానవన శాఖల్లో ఎస్సీ రైతులకు పథకాల అమలుపై అసంతృప్తి వ్యక్తం చేసిన కలెక్టర్, రాబోయే ఏడాదిలో 100 శాతం లక్ష్యాన్ని చేరుకోవాలని సూచించారు.

News March 24, 2026

పుదుచ్చేరి పీఠం ఎవరిదో? – 1/2

image

నాలుగు రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి భవితవ్యం కూడా ఈసారి ఆసక్తికరంగా మారాయి. ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్ (AINRC) ఆధ్వర్యంలోని NDA మరోసారి అధికారంలోకి రావాలనుకుంటోంది. అయితే AINRC-BJP దోస్తీ కాస్త సడలిందనే టాక్ నడుస్తోంది. అమిత్ షా బుజ్జగింపుతో AINRC చీఫ్, పుదుచ్చేరి సీఎం ఎన్.రంగస్వామి శాంతించినా విజయ్ TVK ఎంట్రీ, రాష్ట్ర హోదా డిమాండ్‌ హాట్ టాపిక్‌గా మారింది. <<-se>>#Elections2026<<>>

News March 24, 2026

పుదుచ్చేరి పీఠం ఎవరిదో? – 2/2

image

పాలనపై పూర్తి కంట్రోల్ ఉండట్లేదని, ఈసారి NDA కూటమిలో లాట్చియ జననాయగ కట్చి అనే పార్టీ చేరడం AINRC అసంతృప్తికి కారణం. దీనిని కాంగ్రెస్-DMK తమకు అనుకూలంగా మార్చుకోవాలని ప్రయత్నిస్తున్నాయి. రాష్ట్రహోదా డిమాండ్‌ను కూడా ఎన్నికల అస్త్రంగా వాడుకునే ఛాన్స్ ఉంది. విజయ్ TVK 30 సీట్లలోనూ సోలోగా పోటీ చేయనుండటంతో ఓట్లు చీలే అవకాశాలు ఉన్నాయి. ఇక NDAలో భాగమైన AIADMK ఇక్కడ ఉనికి కోసం పోరాడుతోంది. <<-se>>#Elections2026<<>>