News August 21, 2024
ఒకే ట్రిమ్మర్ ఎక్కువ మంది వాడుతున్నారా?
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_82024/1724206193536-normal-WIFI.webp)
సెలూన్లు, బ్యాచిలర్ రూంలలో ఒకే ట్రిమ్మర్ చాలా మంది వాడుతారు. దీంతో ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లేనని డెర్మటాలజిస్టులు హెచ్చరిస్తున్నారు. ముందు ట్రిమ్మర్ వాడిన వ్యక్తికి HIV, హెపటైటిస్ (B, C), పింపుల్స్, చర్మ వ్యాధులు ఉంటే రెండో వ్యక్తికీ వచ్చే అవకాశం ఎక్కువని హెచ్చరిస్తున్నారు. ట్రిమ్మర్ వాడాల్సి వస్తే బ్లేడ్‌ను తప్పకుండా వేడినీటిలో వాష్ చేయాలని, కొన్నిగంటల గ్యాప్ ఇచ్చి వాడాలని సూచిస్తున్నారు.
Similar News
News February 12, 2025
సంజూ శాంసన్‌కు సర్జరీ పూర్తి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739363807386_1045-normal-WIFI.webp)
ఇంగ్లండ్‌తో ముగిసిన టీ20 సిరీస్ ఆఖరి మ్యాచ్ సందర్భంగా ఆర్చర్ బౌలింగ్‌లో భారత ఓపెనర్ సంజూ శాంసన్ చూపుడు వేలికి గాయమైంది. ఆ వేలికి తాజాగా సర్జరీ పూర్తైందని క్రిక్‌ఇన్ఫో వెల్లడించింది. సర్జరీ నుంచి కోలుకునేందుకు ఆయనకు నెల రోజులు సమయం పట్టొచ్చని తెలిపింది. ఐపీఎల్ సమయానికి సంజూ ఫిట్‌గా ఉంటారని సమాచారం. కాగా.. ఈ సర్జరీ కారణంగా ఆయన కేరళ రంజీ ట్రోఫీ క్వార్టర్‌ఫైనల్‌కు దూరమయ్యారు.
News February 12, 2025
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లే లక్ష్యం: భట్టి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_112024/1732969874940_653-normal-WIFI.webp)
TG: బీసీలకు 42% రిజర్వేషన్లపై మార్చి మొదటి వారంలో క్యాబినెట్‌లో తీర్మానం చేస్తామని Dy.CM భట్టి విక్రమార్క తెలిపారు. ‘శాసనసభలో బిల్లు ఆమోదించి చట్టబద్ధం చేయాలని నిర్ణయించాం. కులగణన బిల్లు కేంద్రానికి పంపి ఒత్తిడి తెచ్చి పార్లమెంట్‌లో ఆమోదానికి కృషి చేస్తాం. బీసీల రిజర్వేషన్లపై కలిసొచ్చే పార్టీలను కలుపుకొని పోతాం. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లే మా లక్ష్యం’ అని భట్టి స్పష్టం చేశారు.
News February 12, 2025
నేరం అంగీకరించిన వీర రాఘవరెడ్డి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739365252085_81-normal-WIFI.webp)
TG: చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకుడు రంగరాజన్‌పై దాడి కేసులో అరెస్టైన ప్రధాన నిందితుడు వీరరాఘవరెడ్డి పోలీసుల విచారణలో నేరాన్ని అంగీకరించారు. తన ‘రామరాజ్యం’ సంస్థలో సభ్యులను చేర్పించాలని, ఆర్థిక సాయం చేయాలని రంగరాజన్‌ను రాఘవరెడ్డి గతంలో కోరారు. ఆయన అంగీకరించకపోవడంతో ఈ నెల 7న ఇంటికి వెళ్లి దాడి చేశారు. ఈ కేసులో 22 మందిని నిందితులుగా చేర్చగా, ఇప్పటివరకు ఆరుగురు అరెస్ట్ కాగా, 16 మంది పరారీలో ఉన్నారు.