News December 10, 2024

రోహిత్, కోహ్లీ జట్టుకు భారంగా మారుతున్నారా?

image

రోహిత్, కోహ్లీ టీమ్‌ఇండియాకు అందించిన సేవలు వెల కట్టలేనివి. కానీ కొన్నాళ్లుగా వీరు టెస్ట్ జట్టుకు భారంగా మారుతున్నారా? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. BGT 2వ టెస్టుతో సహా కొన్నాళ్లుగా విఫలమవుతున్నారనే విమర్శలున్నాయి. కోహ్లీ తొలి టెస్టులో సెంచరీ చేసినా ఆఫ్‌సైడ్ బంతుల్ని వెంటాడి మరీ ఔట్ అవుతున్నారు. జూనియర్లకు ఆదర్శంగా నిలవకుండా జట్టుకు భారంగా మారడం టెస్టు విజయాలపై ప్రభావం చూపే అంశమే. దీనిపై మీ COMMENT.

Similar News

News November 6, 2025

ప్రభుత్వ స్కూళ్లలో 2,837 ఉద్యోగాలు!

image

తెలంగాణలోని ప్రభుత్వ స్కూళ్లలో 2,837 కంప్యూటర్ టీచర్లను (ఐసీటీ ఇన్‌స్ట్రక్టర్లు) నియమించనున్నారు. విద్యార్థులకు ఐటీలో శిక్షణ ఇవ్వడానికి ఔట్ సోర్సింగ్ విధానంలో టీచర్లను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ టెక్నాలజీ సర్వీసెస్ ద్వారా ఈ నియామక ప్రక్రియ చేపట్టనున్నారు. నెలకు గౌరవ వేతనంగా రూ.15వేలు చెల్లించనున్నారు. త్వరలో నోటిఫికేషన్ విడుదల చేసి అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు.

News November 6, 2025

ఇతిహాసాలు క్విజ్ – 58 సమాధానాలు

image

1. ధృతరాష్ట్రుడి రథసారథి ‘సంజయుడు’.
2. కంసుడి తండ్రి ‘ఉగ్రసేనుడు’.
3. శశాంకుడు అంటే ‘చంద్రుడు’.
4. విశ్వకర్మ పుత్రిక ‘సంజ్ఞ’.
5. తెలుగు సంవత్సరాలు ‘60’.
<<-se>>#Ithihasaluquiz<<>>

News November 6, 2025

ముగిసిన తొలి విడత పోలింగ్

image

బిహార్‌లో తొలి విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు 60.13శాతం పోలింగ్ నమోదైంది. బెగుసరాయ్‌లో అత్యధికంగా 67.32శాతం ఓటింగ్ నమోదైంది. ఇప్పటివరకు క్యూలో నిల్చున్న వారికి ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నారు. దీంతో పోలింగ్ శాతం మరింత పెరగనుంది. మొత్తం 243 నియోజకవర్గాలకు గానూ ఇవాళ 121 స్థానాల్లో పోలింగ్ జరిగింది. ఈనెల 11న మరో విడత పోలింగ్ తర్వాత 14న ఫలితాలు వెలువడతాయి.