News April 4, 2025

అధిష్ఠానానికి సీనియర్లు, కార్యకర్తలు కనబడట్లేదా?: రాజా సింగ్

image

TG: హైదరాబాద్ స్థానిక సంస్థల BJP ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికపై ఆ పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ పెద్దలు, అధిష్ఠానంపై మండిపడ్డారు. హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో అభ్యర్థులు లేరా? అని ప్రశ్నించారు. అధిష్ఠానానికి సీనియర్లు, కార్యకర్తలు కనబడట్లేదా? అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. డా.ఎన్.గౌతమ్ రావును MLC అభ్యర్థిగా BJP బరిలో నిలిపిన విషయం తెలిసిందే.

Similar News

News September 12, 2025

సాయిశ్రీనివాస్ ‘కిష్కింధపురి’ రివ్యూ&రేటింగ్

image

దెయ్యం నుంచి చిన్నారిని రక్షించేందుకు హీరో చేసే సాహసమే ‘కిష్కింధపురి’. బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమ నటన ఆకట్టుకుంది. భయపెట్టే సీన్లు, బ్యాగ్రౌండ్ స్కోర్, విజువల్స్ ఎఫెక్ట్స్ మంచి ఎక్స్‌పీరియన్స్‌ ఇస్తాయి. కొన్నిసీన్లు రొటీన్ హారర్ మూవీని తలపిస్తాయి. లాజిక్‌లు లేకపోవడం, అక్కడక్కడా కన్‌ఫ్యూజన్, క్లైమాక్స్ వరకు మూవీని సక్సెస్‌ఫుల్‌గా తెరకెక్కించడంలో డైరెక్టర్ కౌశిక్ గాడితప్పారు.
రేటింగ్: 2.25/5

News September 12, 2025

పాలలో వెన్న శాతం పెరగాలంటే..

image

పాల కేంద్రాల్లో వెన్న శాతాన్ని బట్టి పాల ధరను నిర్ణయిస్తారు. గేదె పాలలో వెన్న ఎక్కువగా 6%-8%, దేశవాళీ పాడి పశువుల పాలల్లో 4-4.5%, సంకర జాతి పాడి పశువుల పాలలో 3-4% వెన్న ఉంటుంది. పప్పుజాతి పశుగ్రాసాలను, గడ్డిజాతి, ధాన్యపు జాతి పశుగ్రాసాలను, జొన్నచొప్ప, సజ్జ చొప్ప, మొక్కజొన్న చొప్పలను ఎండు గడ్డిగా పశువులకు అందించాలి. ఇవి లేనప్పుడు ఎండు వరిగడ్డిని పశువుకు మేతగా ఇస్తే పాలలో వెన్నశాతం తగ్గదు.

News September 12, 2025

నవంబర్‌లో భారత్‌కు డొనాల్డ్ ట్రంప్?

image

ఈ ఏడాది భారత్‌లో జరగబోయే క్వాడ్ సమ్మిట్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హాజరయ్యే అవకాశం ఉందని యూఎస్ అంబాసిడర్ టు ఇండియా సెర్గీ గోర్ తెలిపారు. ఈ సమ్మిట్ కోసం ట్రంప్ చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారని ఆయన పేర్కొన్నారు. కాగా వచ్చే నవంబర్‌లో ఢిల్లీలో క్వాడ్ సదస్సు జరగనుంది. దీనికి భారత్‌తోపాటు ఆస్ట్రేలియా, జపాన్, యూఎస్ నేతలు హాజరు కానున్నారు.