News October 28, 2024

TGSP కానిస్టేబుల్స్ వంటమనుషులా?.. వాట్సాప్ మెసేజ్ VIRAL

image

TGSP కానిస్టేబుల్స్‌ను పైఅధికారులు వ్యక్తిగతంగా ఎలా వాడుకుంటున్నారో తెలిపేలా ఓ వాట్సాప్ మెసేజ్ నెట్టింట వైరల్ అవుతోంది. ఒక IPS ఇంట్లో వంట పని చేసేందుకు కానిస్టేబుల్ లేదా హెడ్ కానిస్టేబుల్ కావాలని, కేవలం వెజ్ ఫుడ్ మాత్రమే వండాలని ఆ మెసేజ్‌లో ఉంది. కాగా TGSP కానిస్టేబుల్స్ పరిస్థితులు మరీ ఇంత దారుణమా? అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదేంటని అడిగితే డిస్మిస్ చేస్తారా? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

Similar News

News November 1, 2024

ఆ విషయంలో జగన్‌కు ఆస్కార్ ఇవ్వొచ్చు: నిమ్మల

image

AP: ప్రపంచంలో తల్లిని, చెల్లిని మోసం చేసిన జగన్ లాంటి దౌర్భాగ్య రాజకీయవేత్త ఎక్కడా కనిపించరని మంత్రి నిమ్మల రామానాయుడు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆయనకు ప్రజా జీవితంలో ఉండే అర్హత లేదన్నారు. పోలవరం ఎత్తుపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అబద్ధాల్లో జగన్‌కు ఆస్కార్ ఇవ్వొచ్చని చురకలంటించారు. పోలవరం ఎత్తును 41.15 మీటర్లకు తగ్గించి కేంద్ర ప్రభుత్వాన్ని అనుమతి కోరింది జగన్ కాదా అని నిలదీశారు.

News November 1, 2024

జీవితానికి ఆ ఒక్క సెకను చాలు: మలైకా

image

బాలీవుడ్ ప్రేమజంట అర్జున్ కపూర్, మలైకా అరోరా విడిపోయారని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల దీపావళి పార్టీలో తాను సింగిల్ అంటూ అర్జున్ చేసిన <<14479913>>వ్యాఖ్యలు<<>> ఇందుకు బలం చేకూర్చాయి. ఈ నేపథ్యంలో మలైకా ఇన్‌స్టాలో చేసిన పోస్ట్ వైరలవుతోంది. ‘హృదయాన్ని ఒక్క సెకను తాకితే అది జీవితాంతం ఆత్మను తాకవచ్చు’ అని ఆమె రాసుకొచ్చారు. దీనికి అర్థమేమిటి? తన లవ్ లైఫ్ గురించేనా? అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

News November 1, 2024

కత్తులతో దాడి.. ముగ్గురు మృతి

image

AP: దీపావళి పండుగ రోజున కాకినాడ జిల్లాలో ఘర్షణ చెలరేగింది. కాజులూరు(మ) సలపాకలో ఇరువర్గాలు కత్తులతో దాడి చేసుకోగా, ముగ్గురు చనిపోయారు. పాత కక్షల నేపథ్యంలో ఇరువర్గాల మధ్య ఏర్పడిన వాగ్వాదం దాడి చేసుకునే వరకూ వెళ్లింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.