News November 27, 2024
అధికారులు నిద్రపోతున్నారా?: హైకోర్టు ఆగ్రహం

TG: ప్రభుత్వ స్కూళ్లలో ఫుడ్ పాయిజన్ ఘటనలపై తెలంగాణ హైకోర్టు సీరియస్ అయింది. పిల్లలు చనిపోతే కానీ స్పందించరా? అని ప్రభుత్వాన్ని నిలదీసింది. అధికారుల నిర్లక్ష్యానికి ఇది నిదర్శనమని, వారంలో మూడుసార్లు భోజనం వికటిస్తే ఏం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. అధికారులు నిద్రపోతున్నారా? అని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. భోజన విరామం తర్వాత పూర్తి వివరాలు తమకు సమర్పించాలని ఆదేశించింది.
Similar News
News November 2, 2025
T20Iలకు కేన్ మామ గుడ్ బై

NZ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ విలియమ్సన్ T20Iలకు రిటైర్మెంట్ ప్రకటించారు. 2011లో T20ల్లో డెబ్యూ చేసిన ఆయన 93 మ్యాచుల్లో 2,575 రన్స్ చేశారు. ఇందులో 18 హాఫ్ సెంచరీలున్నాయి. అత్యధిక స్కోర్ 95. కివీస్ తరఫున 75 మ్యాచులకు కెప్టెన్సీ చేశారు. షార్టెస్ట్ ఫార్మాట్‌కు వీడ్కోలు పలికేందుకు తనతో పాటు జట్టుకూ ఇదే సరైన సమయమని కేన్ తెలిపారు. దీంతో రానున్న T20WC ప్రిపరేషన్‌కు జట్టుకు క్లారిటీ వస్తుందన్నారు.
News November 2, 2025
లండన్ పర్యటనలో CM చంద్రబాబు దంపతులు

AP: CM చంద్రబాబు, ఆయన సతీమణి నారా భువనేశ్వరి లండన్ పర్యటనకు వెళ్లారు. ఈనెల 5 వరకు ఈ వ్యక్తిగత పర్యటన కొనసాగనుంది. ఈనెల 4న భువనేశ్వరి డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ అవార్డును అందుకోనున్నారు. గతంలో ఈ అవార్డును అబ్దుల్ కలాం, రాజశ్రీ బిర్లా అందుకున్నారు. హెరిటేజ్ ఫుడ్స్ తరఫున గోల్డెన్ పీకాక్ పురస్కారాన్నీ స్వీకరించనున్నారు. అనంతరం CM చంద్రబాబు పలువురు పారిశ్రామికవేత్తలను CII సదస్సుకు ఆహ్వానిస్తారు.
News November 2, 2025
తిరుమలలో ఘనంగా కైశిక ద్వాదశి ఆస్థానం

AP: తిరుమల శ్రీవారి ఆలయంలో కైశిక ద్వాదశి ఆస్థానం ఘనంగా జరుగుతోంది. ఈ సందర్భంగా ఉగ్ర శ్రీనివాసమూర్తి వాహన సేవను నిర్వహించనున్నారు. మలయప్పస్వామి శ్రీదేవీ, భూదేవీ సమేతంగా మాడ వీధుల్లో ఊరేగనున్నారు. ఈ వాహన సేవ ఉ.6-7.30 గంటల మధ్య జరగనుంది. ఏడాదికి ఒక్కసారి మాత్రమే జరిగే ఈ సేవను తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు చేరుకున్నారు.


