News October 4, 2024
ప్రజా నాయకులు ఇలా బారికేడ్ల మధ్యలో ఉంటారా?: వైసీపీ

AP: Dy.CM పవన్ తిరుపతి సభపై YCP విమర్శలు చేసింది. ‘ప్రజా నాయకులు ఇలా బారికేడ్ల మధ్యలో అందరికీ దూరంగా ఉంటారా? వరదల టైమ్లో బయటకు రాని ఈయన కొత్తగా మత రాగం ఎత్తుకున్నాడు. అసెంబ్లీలో కులమతాలకు అతీతంగా ప్రమాణం చేసి ఇప్పుడు కొత్తగా సనాతన ధర్మం డిక్లరేషన్ ఏమిటి? ప్రచారం కోసం మొన్నటిదాకా తిరుపతి లడ్డూను అవమానించారు. ఇప్పుడు రాజకీయం కోసం మత ధర్మాన్ని బారికేడ్ల మధ్యలోకి తెచ్చారు’ అని ట్వీట్ చేసింది.
Similar News
News November 23, 2025
చలికాలంలో కర్లీ హెయిర్ ఇలా సంరక్షించండి

చలి కాలంలో బయటకు వెళ్లేటప్పుడు జుట్టును కవర్ చేసుకునేలా క్యాప్ ధరించడం, స్కార్ఫ్ కట్టుకోవడం మంచిది. ముఖ్యంగా కర్లీ హెయిర్ త్వరగా పొడిబారిపోతుందంటున్నారు నిపుణులు. హెయిర్ సీరమ్, కండిషనర్లు, క్లెన్సర్లలో కాస్త తేనె కలిపి రాసుకోవడం, కొబ్బరి, బాదం, ఆలివ్ నూనెలతో మసాజ్ చేయడం వల్ల జుట్టు తేమగా ఉంటుందని చెబుతున్నారు. అలాగే ప్రతి మూడు నెలలకోసారి చిట్లిన చివర్లను కత్తిరిస్తూ ఉండాలని సూచిస్తున్నారు.
News November 23, 2025
పాడి పశువులకు ఈ లక్షణాలతో ప్రాణాపాయం

పాలజ్వరం అధిక పాలిచ్చే ఆవులు, గేదెల్లో ఎక్కువగా వస్తుంది. వ్యాధి సోకిన పశువులు సరిగా మేత మేయవు. నెమరు వేయక, బెదురు చూపులతో చికాకుగా ఉండి, వణుకుతూ కదలలేని స్థితిలో ఉంటాయి. సరిగా నిలబడలేవు. పశువులు తమ తలను పొట్టకు ఆనించి S ఆకారంలో మగతగా పడుకోవడం పాలజ్వరం ప్రధాన లక్షణం. వ్యాధి తీవ్రమైతే శ్వాస, నాడి వేగం పూర్తిగా పడిపోయి పశువులు మరణించే అవకాశం ఉంది. ఈ వ్యాధి నివారణ సూచనల కోసం <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.
News November 23, 2025
నేడు భారత్ బంద్

మావోయిస్టు అగ్రనేత హిడ్మా ఎన్కౌంటర్ను నిరసిస్తూ నేడు మావోయిస్టు పార్టీ భారత్ బంద్కు పిలుపునిచ్చింది. అనారోగ్యంతో ఉన్న హిడ్మా చికిత్స కోసం విజయవాడకు వస్తే పోలీసులు పట్టుకుని కాల్చి చంపారని మండిపడింది. బంద్ నేపథ్యంలో AOBలో పోలీసులు అప్రమత్తమయ్యారు. విశాఖ నుంచి సీలేరు మీదుగా భద్రాచలం వరకు నడిచే బస్సులను రద్దు చేశారు. ఆదివారం కావడంతో మైదాన ప్రాంతాల్లో బంద్ ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చు.


