News August 20, 2025

బిల్లు పాస్ అయ్యేందుకు అవకాశాలున్నాయా?

image

నెల రోజులు జైలుకెళ్లిన మంత్రుల తొలగింపు బిల్లు పార్లమెంటులో పాస్ అవుతుందా? అనే ప్రశ్న నెలకొంది. రాజ్యాంగ సవరణకు ఉభయసభల్లో 2/3 మెజారిటీ ఉండాలి. లోక్‌సభలో 543 సీట్లలో 362 సభ్యుల మద్దతు కావాల్సి ఉండగా NDA బలం 293. ఇక రాజ్యసభలోని 245 సభ్యుల్లో 164 మంది ఒప్పుకోవాలి. అక్కడ అధికారపక్షానికి ఉన్నది 125. సొంత సంఖ్యా బలం లేక, ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో బిల్లు ఆమోదం ఎలా? అనేది చూడాలి.

Similar News

News August 20, 2025

దాడి తర్వాత షాక్‌కు గురయ్యా: CM రేఖా గుప్తా

image

తనపై జరిగిన దాడి విషయంపై ఢిల్లీ సీఎం <<17460103>>రేఖా గుప్తా<<>> స్పందించారు. ‘దాడి జరగగానే షాక్‌కు గురయ్యా. ఇప్పుడు తేరుకున్నాను. ఇది ఢిల్లీకి సేవ చేయాలనే మా సంకల్పంపై జరిగిన పిరికిపంద చర్య. ప్రజలకు సేవ చేయాలనే నా స్ఫూర్తిని ఇలాంటి దాడులు ఆపలేవు. త్వరలోనే ప్రజల ముందుకు వస్తాను. ప్రజల నుంచి ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కారం మునుపటిలాగానే కొనసాగుతాయి. ప్రజల మద్దతే నాకు కొండంత బలం’ అని Xలో పోస్ట్ చేశారు.

News August 20, 2025

సామాన్య భక్తులకే ప్రథమ ప్రాధాన్యం: మంత్రి ఆనం

image

AP: ఇంద్రకీలాద్రిపై సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు దసరా ఉత్సవాలు వైభవంగా నిర్వహించనున్నట్లు మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. ‘మూలా నక్షత్రం, విజయ దశమి రోజుల్లో ఉచిత లడ్డూ ప్రసాదం అందిస్తాం. దుర్గమ్మ దర్శనాల్లో సామాన్య భక్తులకే ప్రథమ ప్రాధాన్యం ఇస్తాం’ అని దసరా మహోత్సవాల ఏర్పాట్లపై సమీక్షలో తెలిపారు. మరోవైపు విజయవాడ ఖ్యాతి పెంచేలా ఉత్సవాలు నిర్వహిస్తామని MLA సుజనా చౌదరి వెల్లడించారు.

News August 20, 2025

ఈ నెల 23న ఖాతాల్లోకి డబ్బులు

image

AP: గతంలో నిలిచిపోయిన జాతీయ ఉపాధి హామీ పథకం పెండింగ్‌ బిల్లులను విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 2014-19 మధ్య జరిగిన పనుల బిల్లులను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. పనులు చేసిన ఉపాధి హామీ శ్రామికుల ఖాతాల్లో ఈ నెల 23న రూ.145 కోట్లు జమ చేయనుంది.