News March 5, 2025
సక్రమంలో అక్రమాలు?

తెలుగు రాష్ట్రాల్లో ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీం అమలుపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పేదలుంటున్న భూములపై నామినల్ ఫీజుతో వారికి హక్కు ఇచ్చే ఈ బాధ్యత సబ్ రిజిస్ట్రార్లపై ఉంది. కానీ కొందరు భారీ భూ కబ్జాదారులు తమ తరఫు వారితో ఇప్పటికే అప్లికేషన్లు వేయించినట్లు ప్రచారం జరుగుతోంది. వీటిని గుర్తించడంలో ప్రభుత్వ వర్గాలు ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నా భూ సంపద అన్యాక్రాంతం అవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Similar News
News March 11, 2026
BREAKING: IPL తొలి మ్యాచ్ ఎవరి మధ్య అంటే?

క్రికెట్ అభిమానులకు శుభవార్త. IPL-2026 తొలి మ్యాచ్ వివరాలు వెల్లడయ్యాయి. ఈ నెల 28న తొలి మ్యాచ్ జరగనుంది. బెంగళూరులో రా.7.30 గంటలకు జరిగే ఈ పోరులో రాయల్ ఛాలెంజర్స్, సన్ రైజర్స్ తలపడనున్నట్లు IPL ట్వీట్ చేసింది. మరికాసేపట్లో తొలి దశ షెడ్యూల్ రానుంది.
News March 11, 2026
అంతరిక్షంలో అంతా నిశ్శబ్దమే

అంతరిక్షం ఒక నిశ్శబ్ద సామ్రాజ్యం. భూమిపై గాలి ఉండటం వల్ల శబ్ద తరంగాలు ప్రయాణిస్తాయి. కానీ అంతరిక్షంలో గాలి, నీరు వంటి మాధ్యమాలు లేకపోవడంతో అక్కడ పెద్ద పేలుడు జరిగినా అది మనకు అస్సలు వినిపించదు. అక్కడ భారీ గ్రహశకలాలు ఢీకొన్నా, నక్షత్రాలు పేలిపోయినా ఎటువంటి శబ్దమూ రాదు. వ్యోమగాములు పక్కపక్కనే ఉన్నా రేడియో తరంగాలు లేకుండా మాట్లాడుకోలేరు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ‘వంద రోజుల్లో- వంద వింతలు’లో..
News March 11, 2026
ఆ మందులతో లివర్ డ్యామేజీ: అధ్యయనం

ఆయుర్వేదం, ఇతర ప్రత్యామ్నాయ మందుల వాడకంపై తాజా అధ్యయనం షాకింగ్ విషయాలను వెల్లడించింది. 386 రకాల ఉత్పత్తులను పరీక్షించగా 27.7% మందుల్లో స్టెరాయిడ్స్, 31.3% ఉత్పత్తుల్లో జంతు సంబంధిత వ్యర్థాలు ఉన్నట్లు ఇందులో తేలినట్లు ‘ఫ్రాంటియర్స్ ఇన్ గ్యాస్ట్రోఎంటరాలజీ’ ప్రచురించింది. వీటిలో సీసం, ఆర్సెనిక్ వంటి భార లోహాలు మోతాదుకు మించి ఉన్నాయని, వీటివల్ల 39% మందిలో కాలేయం పాడై మరణ ముప్పు పెరుగుతుందని తెలిపింది.


