News October 11, 2025

సహజ కాన్పుతో సమస్యలు వస్తాయా?

image

సిజేరియన్‌తో పోలిస్తే సహజ కాన్పు అయితే ఎలాంటి సమస్యలు ఉండవని చాలామంది అనుకుంటారు. కానీ ఇది అపోహ మాత్రమే అంటున్నారు వైద్యులు. నార్మల్ డెలివరీ తర్వాత చాలామంది మహిళలకు యోని పుండ్లు పడటం, ఇన్ఫెక్షన్లు రావడం, గర్భాశయ వ్యాధి, మూత్ర విసర్జన సమస్యలు, మూత్రం ఆపుకోలేకపోవడం వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి ఎలాంటి కాన్పు జరిగినా వైద్యుల పర్యవేక్షణలో ఉంటూ జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. <<-se>>#PregnancyCare<<>>

Similar News

News October 11, 2025

రేపు ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్, ఓపెన్ CLSకు శంకుస్థాపన

image

AP: మంత్రి నారా లోకేశ్ రేపు విశాఖలో సిఫీ(Sify) ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్, ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్(CLS)కు శంకుస్థాపన చేయనున్నారు. సిఫీ రూ.1,500 కోట్ల పెట్టుబడి, వెయ్యి మందికి పైగా ఉద్యోగాలు కల్పించనుంది. ఇండియాతో పాటు సింగపూర్, మలేషియా, ఆస్ట్రేలియా, థాయ్‌లాండ్ వంటి దేశాల మధ్య త్వరితగతిన డేటా ప్రాసెసింగ్ చేస్తూ విశాఖ CLS వ్యూహాత్మక ల్యాండింగ్ పాయింట్‌గా పనిచేయనుంది.

News October 11, 2025

పప్పుధాన్యాల ఆత్మనిర్భరత మిషన్ లక్ష్యాలివే..

image

పప్పుధాన్యాల ఉత్పత్తిలో దేశాన్ని స్వయం సమృద్ధిగా మార్చడానికి ప్రధాని మోదీ పప్పు ధాన్యాల ఆత్మనిర్భరత మిషన్‌ను ఇవాళ ప్రారంభించారు. ఈ పథకం కింద 2030-31 నాటికి పప్పు ధాన్యాల సాగు విస్తీర్ణాన్ని 275 నుంచి 310 లక్షల హెక్టార్లకు పెంచాలన్నదే కేంద్రం లక్ష్యం. పప్పు ధాన్యాల ఉత్పత్తి 242 నుంచి 350 లక్షల మెట్రిక్ టన్నులకు పెంచడం, హెక్టారుకు పంట ఉత్పాదకత 881 KGల నుంచి 1,130 KGలకు పెంచడం కేంద్రం లక్ష్యం.

News October 11, 2025

అతడికి సపోర్ట్‌గా నేనున్నా: గంభీర్

image

టీమ్ ఇండియా కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్‌ ఇప్పటిదాకా తన బాధ్యతను సరిగ్గా హ్యాండిల్ చేశారని కోచ్ గౌతమ్ గంభీర్ వ్యాఖ్యానించారు. స్టార్ స్పోర్ట్స్ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. ‘ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు గిల్ ఎలా స్పందిస్తాడో చూడాలని ఉంది. అతడికి సపోర్ట్‌గా నేనున్నాను. ప్రొటెక్ట్ చేస్తాను. గిల్ పరిణతి సాధించే వరకు అతడిపై వచ్చే ఎలాంటి విమర్శలనైనా స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నాను’ అని తెలిపారు.