News December 17, 2024

పదో తరగతికి బోర్డు పరీక్షలుండవా?.. కేంద్రం ఏమందంటే?

image

నూతన జాతీయ విద్యా విధానం ప్రకారం ఇకపై పదో తరగతికి బోర్డు పరీక్షలు ఉండవనే మెసేజ్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. దీనిని నమ్మిన విద్యార్థులు అయోమయంలో పడటంతో కేంద్రానికి చెందిన PIB FactCheck దీనిపై క్లారిటీ ఇచ్చింది. కేంద్ర విద్యాశాఖ ఇలాంటి ఆర్డర్ ఇవ్వలేదని స్పష్టం చేసింది. ఇలాంటి తప్పుడు సమాచారాన్ని నమ్మి భయాందోళనకు గురికావొద్దని, దీనిని నమ్మి ఇతరులకు షేర్ చేయొద్దని కోరింది.

Similar News

News November 23, 2025

రేపు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం

image

బాపట్ల కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లుగా కలెక్టర్ వినోద్ కుమార్ ఆదివారం తెలిపారు. ముందుగా ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు సమీక్ష నిర్వహించడం జరుగుతుందన్నారు. అనంతరం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజల నుంచి సమస్యల అర్జీలను స్వీకరించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.

News November 23, 2025

APPLY NOW: జిప్‌మర్‌లో ఉద్యోగాలు

image

జవహర్‌లాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్(JIPMER) 9 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 5వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో MD, DM, MS, DNB, M.Ch ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 50ఏళ్లు. వెబ్‌సైట్: https://jipmer.edu.in/

News November 23, 2025

ఓవైపు CBN, రేవంత్.. మరోవైపు జగన్, KTR

image

తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో రెండు కీలక దృశ్యాలు చర్చనీయాంశంగా మారాయి. పుట్టపర్తిలోని శ్రీసత్యసాయి శతజయంతి ఉత్సవాల్లో AP CM చంద్రబాబు, TG CM రేవంత్ ఒకే వేదికను పంచుకున్నారు. అదే సమయంలో బెంగళూరులో జరిగిన ఓ ఈవెంట్‌కు AP మాజీ CM వైఎస్ జగన్, తెలంగాణ మాజీ మంత్రి KTR కలిసి హాజరయ్యారు. త్వరలో రెండు రాష్ట్రాల్లో పంచాయతీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ సమావేశాలు రాజకీయ వర్గాల్లో కీలక చర్చకు దారి తీశాయి.