News April 10, 2024

జగన్ గొడ్డలి వేటుకు బలి కానివారు ఉన్నారా?: CBN

image

జగన్ గొడ్డలి వేటుకు APలో బలి కానివారు ఉన్నారా? అని నిడదవోలు సభలో చంద్రబాబు ప్రశ్నించారు. ‘ఒక్క రైతైనా బాగుపడ్డారా? పంటలకు గిట్టుబాటు ధర ఇచ్చారా? పెట్రోల్, నిత్యావసరాలు, విద్యుత్ ధరలు పెంచారు. మా కూటమికి అభివృద్ధి, సంక్షేమం, ప్రజాస్వామ్య పరిరక్షణే ధ్యేయం. జగన్ చేసిన విధ్వంసం, అప్పులకు రాష్ట్రం వెంటిలేటర్‌పై ఉంది. గాడి తప్పిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టే శక్తి NDAకు ఉంది’ అని అభిప్రాయపడ్డారు.

Similar News

News March 3, 2026

చంద్రగ్రహణం తర్వాత ఏం చేయాలి?

image

ఇవాళ చంద్రగ్రహణం సా.6.47గంటలకు ముగిసింది. గ్రహణం తర్వాత స్నానం చేయాలని పండితులు తెలిపారు. గ్రహణం కంటే ముందు వండిన వంటలు, పచ్చళ్లపై దర్భ పుల్లలు ఉంచాలని చెబుతున్నారు. ఇల్లు, పూజ గదిని గంగాజలంతో శుద్ధి చేసుకోవాలని సూచిస్తున్నారు. దీని వల్ల గ్రహణ సమయంలో కేతువు ద్వారా ఏర్పడే ప్రతికూల ప్రభావాలు తొలగిపోతాయని నమ్మకం. గ్రహణం తర్వాత దానాలు చేస్తే మంచిదని చెబుతున్నారు.

News March 3, 2026

హార్ముజ్ మూసివేత.. సౌదీ కొత్త ప్లాన్!

image

హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసేయడంతో క్రూడాయిల్ సరఫరాకు సౌదీ అరేబియా ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టింది. ఎర్ర సముద్ర తీరంలోని యంబు టెర్మినల్ నుంచి ఎగుమతి చేయాలని భావిస్తోంది. ఇందుకోసం పర్షియన్ గల్ఫ్ ఫీల్డ్స్‌లోని Abqaiq నుంచి పైపుల ద్వారా క్రూడాయిల్‌ను యంబుకు తరలిస్తారు. అక్కడి నుంచి సూయజ్ కెనాల్ మార్గంలో ఓడల ద్వారా యూరప్ వైపు, బాబ్-అల్-మందెబ్ జలసంధి ద్వారా హిందూ మహాసముద్రంవైపు తరలించవచ్చు.

News March 3, 2026

ఇరాన్ చర్చలకు సిద్ధం అంటోంది: ట్రంప్

image

ఇరాన్ ఎయిర్ డిఫెన్స్, ఎయిర్ ఫోర్స్‌, నేవీ, నాయకత్వాన్ని నాశనం చేశామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. తమతో చర్చలకు సిద్ధమని ఇరాన్ అంటోందని, కానీ ఇప్పటికే ఆలస్యమైందని చెప్పానని ట్రూత్ సోషల్‌లో పేర్కొన్నారు. మరోవైపు ఈ యుద్ధం 4-5 వారాలపాటు కొనసాగవచ్చని తెలిపారు. ఆ లోపు ముగించేస్తామని, ఇజ్రాయెల్-US దళాలకు ఇది పెద్ద కష్టం కాదని చెప్పారు.