News March 30, 2024

ఇలాంటి ఫోన్ కాల్స్ వస్తున్నాయా? జాగ్రత్త!

image

తమ శాఖ పేరుతో వచ్చే ఫోన్ కాల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని మొబైల్ యూజర్లకు టెలికాం శాఖ సూచించింది. సైబర్ నేరగాళ్లు విదేశీ నంబర్ల నుంచి వాట్సాప్ కాల్స్ చేసి మొబైల్ నంబర్ నిలిపివేస్తామని బెదిరిస్తున్నారని, వ్యక్తిగత డేటా దొంగిలించి మోసాలకు పాల్పడుతున్నారని తెలిపింది. ఇలాంటి కాల్స్‌ వస్తే వెంటనే సంచార్ సాథీ పోర్టల్‌, 1930 హెల్ప్‌లైన్ నంబర్ లేదా సైబర్ క్రైమ్ వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయాలని సూచించింది.

Similar News

News April 20, 2026

GNT: కేటుగాడి ఆట కట్టించిన పోలీసులు

image

సామాజిక మాధ్యమాల ద్వారా సంపన్న యువతులే లక్ష్యంగా వలవేస్తున్న వట్టిచెరుకూరు మండలం చామళ్లమూడి గ్రామానికి చెందిన కోడూరి చంద్రశేఖర్ ఆజాద్‌ను HYDలోని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. ప్రేమ పేరుతో దగ్గరై ఏకాంత ఫోటోలు, వీడియోలతో బ్లాక్‌మెయిల్‌కు పాల్పడేవాడు. ఇలా రెండేళ్లలో 20 మందికి పైగా అమ్మాయిల నుంచి లక్షల్లో నగదు, బంగారం వసూలు చేశాడు. HYDలో ఓ మైనర్ బాలిక నుంచి ఏకంగా రూ.20 లక్షలు కాజేశాడు.

News April 20, 2026

తగ్గిన బంగారం ధరలు

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రా. పసిడి రూ.490 తగ్గి రూ.1,55,290 పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రా. గోల్డ్ రూ.450 తగ్గి రూ.1,42,350కి చేరింది.

News April 20, 2026

ఇక నుంచి యాక్టివ్‌గా కేసీఆర్!

image

TG: నేడు జగిత్యాలలో జరిగే బహిరంగ సభతో కేసీఆర్ పొలిటికల్ రీఎంట్రీ ఇవ్వనున్నారు. గత పార్లమెంట్ ఎన్నికల (2024) తర్వాత కేసీఆర్ ప్రజల మధ్యకు రాలేదు. అసెంబ్లీ సమావేశాలకు కూడా హాజరుకావడం లేదు. దీంతో నేడు జరగబోయే సభ రాజకీయంగా కీలకంగా మారనుంది. కేసీఆర్ ఇక నుంచి యాక్టివ్ అవుతారని, ప్రభుత్వ వైఫల్యాలపై నేటి సభలో విరుచుకుపడతారని గులాబీ వర్గాలు చెబుతున్నాయి. మరి కేసీఆర్ ఎలాంటి కార్యాచరణ ప్రకటిస్తారో చూడాలి.