News March 20, 2024
ఈ లక్షణాలు కనిపిస్తే వడదెబ్బే?
మార్చిలోనే ఎండలు దంచికొడుతున్నాయి. ఏదైనా పని మీద బయటకు వస్తే వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉంది. వడదెబ్బ తగిలితే తల తిరగడం, కళ్లు బైర్లు కమ్మడం, నాలుక తడారి పోతుంది. అలాగే గుండె వేగంగా కొట్టుకోవడం, దాహంగా అనిపిస్తుంది. వాంతులు, విరేచనాలు కూడా అవుతాయి. వడదెబ్బ నుంచి తప్పించుకోవాలంటే నీళ్లు ఎక్కువగా తాగాలి. బయటికెళ్తే కొబ్బరి నీళ్లు, పండ్ల రసాలు తీసుకోవాలి. మధ్యాహ్నం పూట లేత రంగు బట్టలు ధరించాలి.
Similar News
News January 6, 2025
నేడు ఈడీ విచారణకు విజయసాయి రెడ్డి
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి నేడు ఈడీ విచారణకు హాజరుకానున్నారు. కాకినాడ పోర్ట్ సెజ్ కేసు, అక్రమంగా షేర్ల బదలాయింపు వ్యవహారంలో అధికారులు VSRను ప్రశ్నించనున్నారు. ఉ.10 గంటలకు హైదరాబాద్ బషీర్బాగ్లోని ఈడీ కార్యాలయంలో విచారణ ప్రారంభం కానుంది.
News January 6, 2025
OTTల్లో ఈ సినిమాలు చూశారా?
గతేడాది కొన్ని సినిమాలు ప్రేక్షకులను అలరించాయి. అవి ఏ ఓటీటీల్లో స్ట్రీమ్ అవుతున్నాయో చూద్దాం.
*దేవర, లక్కీ భాస్కర్, అమరన్, సత్యం సుందరం, మహారాజ, ఆడు జీవితం, సరిపోదా శనివారం- నెట్ఫ్లిక్స్
*ప్రేమలు, కిల్- డిస్నీ+హాట్స్టార్
*కల్కి- అమెజాన్ ప్రైమ్
*హనుమాన్- ZEE5, జియో సినిమా
>>ఇంకా మీకు నచ్చిన సినిమాలేవో కామెంట్ చేయండి.
News January 6, 2025
ఏడాదిలో ₹లక్షన్నర కోట్ల అప్పు.. ఆ డబ్బంతా ఎటు పోయింది: KTR
TG: కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిలో ₹లక్షన్నర కోట్ల అప్పు చేసిందని, ఆ డబ్బంతా ఏమైందని KTR ప్రశ్నించారు. ‘6 గ్యారంటీలు, రుణమాఫీ, రైతు భరోసా, ₹4వేల పింఛను, మహిళలకు ₹2,500, తులం బంగారం ఇవ్వనేలేదు. అయినా అప్పు ఎందుకయింది?’ అని ప్రభుత్వాన్ని నిలదీశారు. BRS ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్మాణంతో పాటు ఎన్నో పథకాలు ఇచ్చిందని, పదేళ్లలో ₹4 లక్షల కోట్ల అప్పు చేసిన KCR సర్కారుపై విషప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.