News June 9, 2024
కేంద్రంలో TDP మంత్రుల శాఖలు ఇవేనా?
AP: కేంద్ర మంత్రివర్గంలో స్థానం దక్కించుకున్న టీడీపీ ఎంపీలు రామ్మోహన్ నాయుడు (శ్రీకాకుళం), పెమ్మసాని చంద్రశేఖర్ (గుంటూరు) శాఖలపై ఓ వార్త వైరల్ అవుతోంది. వీరిలో ఒకరికి ఐటీశాఖ, మరొకరికి ఉక్కు, గనులశాఖ దక్కబోతుందని ప్రచారం జరుగుతోంది. టీడీపీ మొదటి నుంచి పట్టుబడుతోన్న గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ జేడీయూకు కేటాయించనున్నట్లు టాక్. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది.
Similar News
News January 12, 2025
నేడు మృతుల కుటుంబాలకు చెక్కుల పంపిణీ
AP: తిరుపతి తొక్కిసలాట ఘటనలో మరణించిన ఆరుగురి కుటుంబాలకు నేడు టీటీడీ చెక్కులు పంపిణీ చేయనుంది. ఛైర్మన్ బీఆర్ నాయుడు ఆధ్వర్యంలోని బృందాలు వైజాగ్, నర్సీపట్నం, తమిళనాడు, కేరళలోని మృతుల కుటుంబాల ఇంటికి వెళ్లనున్నాయి. వారి కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున చెక్కు ఇవ్వడంతో పాటు కుటుంబంలో ఒకరికి కాంట్రాక్టు ఉద్యోగం, ఉచిత విద్యను అందించేందుకు వివరాలు సేకరించనున్నాయి.
News January 12, 2025
యువతకు స్ఫూర్తి ప్రదాత.. వివేకానంద
భారతీయ ఆధ్యాత్మిక విలువలను ప్రపంచానికి చాటిన తత్వవేత్త స్వామి వివేకానంద. దేశ సాంస్కృతిక వైభవాన్ని విశ్వవ్యాప్తి చేయడంలో ఆయన నిరంతరం కృషి చేశారు. 1893లో చికాగోలో హిందుత్వాన్ని పరిచయం చేస్తూ చేసిన ప్రసంగంతో ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నారు. యువతే దేశ అభివృద్ధికి పునాదులు అంటూ నిరంతరం ప్రోత్సహించేవారు. ఆయనకు గౌరవ సూచకంగా వివేకానంద జయంతి(JAN 12)ని జాతీయ యువజన దినోత్సవంగా నిర్వహించుకుంటున్నాం.
News January 12, 2025
నేడు అరకు లోయకు సుప్రీంకోర్టు జడ్జిలు
AP: సుప్రీంకోర్టు సీజేఐ సంజీవ్ ఖన్నాతో సహా 25 మంది న్యాయమూర్తుల బృందం నేడు అరకులోయలో పర్యటించనుంది. వీరంతా విశాఖపట్నం నుంచి రైలులో ఉదయం 10.30 గంటలకు అరకు లోయకు చేరుకోనున్నారు. గిరిజన మ్యూజియం, గిరి గ్రామదర్శినిని పరిశీలిస్తారు. స్థానిక గిరిజనుల స్థితిగతులను, పరిస్థితులను తెలుసుకోనున్నారు. అనంతరం బొర్రా గుహలను సందర్శించనున్నారు. వీరి రాక నేపథ్యంలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.