News October 1, 2024
తెలంగాణలో కొత్త మంత్రులు వీరేనా?

TG: దసరా నాటికి మంత్రివర్గాన్ని విస్తరించాలని కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. ఈమేరకు పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి(NLG), గడ్డం వినోద్(ADB), గడ్డం వివేకానంద్(ADB), ప్రేమ్సాగర్ రావు(ADB), బాలూనాయక్(NLG), రామచంద్రునాయక్(WGL), మల్రెడ్డి రంగారెడ్డి(RR), సుదర్శన్రెడ్డి(NZB), దానం నాగేందర్(HYD), వాకిటి శ్రీహరి(MBNR) ఉన్నారు. మరికొద్దిరోజుల్లో క్లారిటీ రానుంది.
Similar News
News November 22, 2025
తాజా సినీ ముచ్చట్లు

*రేపు ఉ.10.08 గంటలకు నాగ చైతన్య మూవీ(NC24) టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్ చేయనున్న మహేశ్
*మహిళలు ఏకమైతే వారి శక్తిని ఎవరూ ఆపలేరు: రష్మిక
*జనవరి 8న నార్త్ అమెరికాలో 8AM PST(ఇండియాలో 9.30PM)కి ప్రభాస్ రాజాసాబ్ చిత్రం వరల్డ్ ఫస్ట్ ప్రీమియర్
*వారణాసిలో అద్భుతమైన సంగీతం ఉంటుంది. మొత్తం 6 పాటలు ఉంటాయి: కీరవాణి
*నా ‘మాస్క్’ చిత్రం విజయం సాధిస్తే.. పిశాచి-2 మూవీని నేనే రిలీజ్ చేస్తా: హీరోయిన్ ఆండ్రియా
News November 22, 2025
గర్భిణులు రోజుకెంత ఉప్పు తీసుకోవాలంటే..

గర్భిణులు ఆహార విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. కొందరు ఎక్కువ ఉప్పు తింటే మరికొందరు తక్కువ ఉప్పు తింటారు. కానీ గర్భిణులు రోజుకి 3.8గ్రాముల ఉప్పు మాత్రమే తీసుకోవాలంటున్నారు నిపుణులు. మరీ తప్పనిసరి పరిస్థితుల్లో అయితే 5.8గ్రాముల వరకు తీసుకోవచ్చు. దీని కంటే ఎక్కువగా తీసుకుంటే కాళ్లు, చేతుల వాపులు, తరచుగా మూత్రవిసర్జన, అధిక రక్తపోటు సమస్యలు వస్తాయని గైనకాలజిస్ట్లు చెబుతున్నారు.
News November 22, 2025
APPLY NOW: సింగరేణిలో 82 పోస్టులు

సింగరేణిలో 82 ఎగ్జిక్యూటివ్ క్యాడర్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఈ పోస్టులను ఇంటర్నల్ అభ్యర్థులతో భర్తీ చేయనున్నారు. అర్హతగల అభ్యర్థులు ఈ నెల 24లోగా అప్లై చేసుకోవాలి. దరఖాస్తు హార్డ్ కాపీని ఈనెల 26లోగా పంపాలి. బేసిక్ శాలరీ నెలకు రూ.50,000 చెల్లిస్తారు. వెబ్సైట్: scclmines.com


