News February 8, 2025

ఢిల్లీ సీఎం రేసులో ఉన్నది వీరేనా..!

image

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో BJP ఘన విజయం సాధించింది. దీంతో ఢిల్లీకి కాబోయే ముఖ్యమంత్రి ఎవరనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. పర్వేశ్ వర్మ, మనోజ్ తివారీ, బన్సూరి స్వరాజ్, విజేందర్ గుప్తా, హరీశ్ ఖురానా, కైలాశ్ గహ్లోత్, వీరేంద్ర సచ్‌దేవ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే అరవింద్ కేజ్రీవాల్‌పై గెలిచిన వెంటనే పర్వేశ్ శర్మ కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది.

Similar News

News March 26, 2026

ఏప్రిల్ 25న కవిత కొత్త పార్టీ లాంచ్?

image

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సొంత పార్టీ ఏర్పాటుకు ముహూర్తం ఖరారు చేసినట్లు సమాచారం. ఏప్రిల్ 25న అధికారికంగా పార్టీని ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. పార్టీ పేరు ‘తెలంగాణ ప్రజా జాగృతి’గా, గుర్తుగా ‘ధర్మగంట’ను ఎంచుకున్నట్లు టాక్. రేపు నిజామాబాద్‌లో జరిగే సమావేశంలో దీనిపై పూర్తి క్లారిటీ ఇవ్వనున్నారు. అలాగే మహిళా రిజర్వేషన్ బిల్లులో OBC మహిళలకు సబ్ కోటా కల్పించాలని డిమాండ్ చేశారు.

News March 26, 2026

2 రోజుల్లో రూ.15.80 లక్షల కోట్ల లాభం

image

యుద్ధ మేఘాలు తొలగిపోతున్నాయన్న సంకేతాలతో భారత స్టాక్ మార్కెట్లు బుధవారం రికార్డు స్థాయిలో రాణించాయి. కేవలం 2 రోజుల్లోనే ఇన్వెస్టర్ల సంపద ఏకంగా రూ.15.80 లక్షల కోట్లు పెరిగింది. బుధవారం సెన్సెక్స్ 1,205 పాయింట్లు, నిఫ్టీ 394 పాయింట్లు ఎగబాకాయి. క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గడం, అంతర్జాతీయంగా సానుకూల పరిస్థితులు దీనికి ప్రధాన కారణం. శ్రీరామ నవమి సందర్భంగా నేడు మార్కెట్లకు సెలవు.

News March 26, 2026

గ్యాస్ సంక్షోభం.. భారత్‌ను ఆదుకుంటున్న అర్జెంటీనా

image

పశ్చిమాసియా యుద్ధం వల్ల భారత్‌లో ఏర్పడిన LPG కొరతను తీర్చడానికి అర్జెంటీనా ముందుకొచ్చింది. 2026 మొదటి 3 నెలల్లోనే దాదాపు 50,000 టన్నుల గ్యాస్‌ను భారత్‌కు పంపింది. ఇది గతేడాది మొత్తం ఎగుమతుల కంటే రెండింతలు ఎక్కువ. సుమారు 20,000 కిలోమీటర్ల సుదూర ప్రయాణం, రవాణా ఖర్చులు భారమైనప్పటికీ భారత్ ఇంధన అవసరాల కోసం అర్జెంటీనా తన సహకారాన్ని పెంచింది.