News January 1, 2025
ఏపీ బీజేపీ చీఫ్ రేసులో ఉంది వీరేనా?

సంక్రాంతి తర్వాత AP BJPకి ఆ పార్టీ అధిష్ఠానం కొత్త చీఫ్‌ను ప్రకటించే ఛాన్సుంది. ప్రస్తుత చీఫ్ పురందీశ్వరికి కేంద్ర క్యాబినెట్లో పదవి ఇస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అధ్యక్ష పదవి ఎవరికిస్తారనే చర్చ మొదలైంది. ఎమ్మెల్యేలు డా.పివి.పార్థసారథి, సుజనా చౌదరి, మాజీ MLC పీవీఎన్ మాధవ్, సీనియర్ నేత పురిఘళ్ల రఘురామ్ పేర్లు వినిపిస్తున్నాయి. దీనిపై పార్టీ నుంచి స్పష్టత రావాల్సి ఉంది.
Similar News
News November 18, 2025
BIG ALERT: మీకు ఇలాంటి మెసేజ్ వచ్చిందా?

సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త మార్గంలో ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా ఆధార్ అప్డేట్ చేసుకోకపోతే SBI YONO యాప్ బ్లాక్ అవుతుందంటూ వాట్సాప్ మెసేజ్‌లు చేస్తున్నారు. SBI లోగోను డీపీగా పెట్టుకుని APK ఫైల్స్‌ను పంపుతున్నారు. దీన్ని క్లిక్ చేస్తే అప్డేట్ అవుతుందని చెబుతున్నారు. అయితే SBI అలాంటి ఫైల్స్‌ను ఎప్పుడూ పంపదని, వాటిని క్లిక్ చేయొద్దని PIB Fact Check స్పష్టం చేసింది.
#ShareIt

INTRESTING: కృష్ణాంగారక చతుర్దశి కథ

పూర్వం అవంతీ నగరంలో భరద్వాజ మహర్షికి అప్సరసపై మోహం కలగగా, వీర్యం భూమిపై పడింది. దీంతో ఎర్రటి కుసుమం వంటి బాలుడు జన్మించాడు. అతడే అంగారకుడు. అతణ్ని భూదేవి పెంచింది. భరద్వాజుడు ఉపనయనం చేసి, గణపతి మంత్రాన్ని ఉపదేశించాడు. అంగారకుడు ఓనాడు నర్మదా తీరాన నిష్ఠగా జపించగా, గణపతి సాక్షాత్కరించాడు. అప్పుడు అంగారకుడు తన పేరుతో ఓరోజు మంగళకరం కావాలని, ఆ రోజున గణపతిని పూజిస్తే కష్టాలు తొలగిపోవాలని వరం కోరాడు.