News August 6, 2024

హసీనా పతనానికి కారణాలు ఇవేనా?

image

షేక్ హ‌సీనా 2009లో రెండోసారి ప‌గ్గాలు చేప‌ట్టాక చేసిన ప్ర‌తీకార రాజ‌కీయాలు ఆమె ప‌త‌కానికి నాంది ప‌లికాయి. 1971 యుద్ధ నేరాల కేసుల‌ను తిర‌గ‌దోడి, విపక్ష నేతలు ఎన్నిక‌ల్లో పాల్గొన‌కుండా నిషేధించి, వారిని జైళ్ల‌కు పంపారు. వీటికి తోడు దేశంలో ఆర్థిక ప‌రిస్థితి దిగ‌జార‌డం, నిరుద్యోగం, హింస‌ పెరిగిపోవ‌డం లాంటి కార‌ణాలు ప్ర‌జ‌ల్లో తిరుగుబాటుకు దారితీశాయి.

Similar News

News January 17, 2026

మోదీ అండతో మనం మరింత ముందుకెళ్లాలి: CM

image

దేశానికి వచ్చిన పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకే వచ్చాయని CM చంద్రబాబు తెలిపారు. ‘ఏపీకి ఉన్న అన్ని రకాల వనరులు ఉపయోగించుకుంటున్నాం. ఇటీవల రూ.8.75 లక్షల కోట్ల పెట్టుబడులకు అనుమతి ఇచ్చాం. గ్రీన్ హైడ్రోజన్, క్వాంటమ్ కంప్యూటింగ్, సెమీ కండక్టర్ మిషన్, డేటా సెంటర్లు, రోబోటిక్స్ వస్తున్నాయి. నాలెడ్జ్ ఎకానమీలో ముందున్న వారే విజేతలు అవుతారు. PM మోదీ అండతో మనం మరింత ముందుకెళ్లాలి’ అని కాకినాడలో సూచించారు.

News January 17, 2026

H1B వీసాలు.. డాక్టర్లే ఎక్కువగా సంపాదిస్తున్నారట!

image

అమెరికాలో H1B వీసాలతో టెకీల కంటే మెడికల్ స్పెషలిస్టులే ఎక్కువగా సంపాదిస్తున్నారని ఓ అధ్యయనంలో తేలింది. కొందరు స్పెషలిస్టుల (రేడియాలజిస్టులు, కార్డియాలజిస్టులు, సర్జన్లు, న్యూరాలజిస్టులు) జీతాలు 3 లక్షల డాలర్ల కంటే ఎక్కువగా ఉన్నాయని పేర్కొంది. డాక్టర్ల తర్వాత లాయర్లు, కంప్యూటర్ సిస్టమ్ మేనేజర్లు, ఫైనాన్స్ మేనేజర్లు లక్ష-2 లక్షల డాలర్లు సంపాదిస్తున్నారని తెలిపింది.

News January 17, 2026

ఇరిగేషన్, ఎడ్యుకేషనే నాకు తొలి ప్రాధాన్యం: CM రేవంత్

image

TG: దేశానికి తొలి PM నెహ్రూ సాగునీటి ప్రాజెక్టులు, విద్యకే తొలి ప్రాధాన్యం ఇచ్చారని, తానూ ఇరిగేషన్, ఎడ్యుకేషన్‌కే పెద్దపీట వేస్తానని CM రేవంత్ రెడ్డి తెలిపారు. MBNR(D) చిట్టబోయినపల్లిలో IIIT నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సందర్భంగా మాట్లాడారు. భవిష్యత్తు చదువుపైనే ఆధారపడి ఉంటుందని, ప్రతి విద్యార్థి నిబద్ధతతో చదువుకోవాలని సూచించారు. 25 ఏళ్ల వరకు కష్టపడితే 75 ఏళ్ల వరకు సంతోషంగా జీవించవచ్చన్నారు.