News January 31, 2025

వణికిస్తున్న విమాన ప్రమాదాలు.. కారణాలు ఇవేనా?

image

ఇటీవల వరుస <<15307610>>విమాన ప్రమాదాలు<<>> ప్రయాణికులను వణికిస్తున్నాయి. ఈ ప్రమాదాలకు 5 కారణాలు ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. 50 శాతం విమాన ప్రమాదాలకు పైలట్లే కారణమని అంటున్నారు. 20 శాతం సాంకేతిక సమస్యలు, 15 శాతం తుఫాన్లు, పిడుగులు, ప్రతికూల వాతావరణం, 5 శాతం టెర్రరిజం, మిస్సైల్ దాడులు, 10 శాతం ప్రమాదాలకు ఇతర కారణాలు ఉన్నాయని చెబుతున్నారు.

Similar News

News January 31, 2025

మహా కుంభమేళాకు ఏపీ ప్రత్యేక బస్సులు

image

AP: UPలో జరుగుతున్న మహా కుంభమేళా కోసం పర్యాటకాభివృద్ధి సంస్థ ప్రత్యేకంగా 2 బస్సుల్ని ఏర్పాటు చేయనుంది. వచ్చే నెల 11న తిరుపతి నుంచి, 12న నెల్లూరు నుంచి ఈ బస్సులు ప్రారంభమవుతాయని ప్రకటించింది. ఆ వివరాల ప్రకారం.. తిరుపతి బస్సు కడప, కర్నూలు, హైదరాబాద్ మీదుగా వెళ్తుంది. తిరిగి 18న తిరుపతికి చేరుకుంటుంది. ఇక నెల్లూరు బస్సు విజయవాడ, రాజమహేంద్రవరం, వైజాగ్ మీదుగా వెళ్లి 19న నెల్లూరుకు తిరిగిరానుంది.

News January 31, 2025

విమాన ప్రమాదం PHOTOS

image

అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో జరిగిన <<15306564>>ఫ్లైట్ యాక్సిడెంట్<<>> ఫొటోలను అధికారులు విడుదల చేశారు. రీగన్ విమానాశ్రయంలో బంబార్డియర్ CRJ-701 విమానం ల్యాండ్ అవుతుండగా సైనిక హెలికాప్టర్ గాల్లో ఢీకొట్టింది. దీంతో విమానం మూడు చోట్ల ముక్కలుగా విరిగిపోయి పోటోమాక్ నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో విమానంలోని మొత్తం 64 మంది, హెలికాప్టర్‌లోని ముగ్గురు ప్రాణాలు వదిలారు.

News January 31, 2025

డాలర్‌ను కాదంటే.. బ్రిక్స్‌కు ట్రంప్ స్ట్రెయిట్ వార్నింగ్

image

డాలర్‌ నుంచి పక్కకు వెళ్లేందుకు ప్రయత్నిస్తే బ్రిక్స్ దేశాలపై 100% టారిఫ్స్ తప్పదని US Prez డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. తాము చేతులు కట్టుకొని చూస్తూ నిలబడే పరిస్థితి ముగిసిందన్నారు. ‘బ్రిక్స్ దేశాలు డాలర్‌కు ప్రత్యామ్నాయంగా మరో కరెన్సీ తేకుండా మాకు కమిట్మెంట్ అవసరం. లేదంటే టారిఫ్స్ ఎదుర్కోవాల్సిందే. US ఎకానమీలో అమ్మకాలకు గుడ్‌బై చెప్పాల్సిందే. లేదా మరో దేశాన్ని వెతుక్కోవాలి’ అని అన్నారు.