News January 5, 2025
భారత్ BGT కోల్పోవడానికి కారణాలు ఇవేనా?
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని భారత్ 1-3 తేడాతో ఆస్ట్రేలియాకు అప్పగించింది. ఈ దారుణ పరాజయానికి చాలా కారణాలు ఉన్నట్లు ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. స్టార్ ప్లేయర్స్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ పేలవ ప్రదర్శన, బుమ్రా మినహా మిగతా బౌలర్లు రాణించకపోవడం, జట్టు ఎంపిక, కూర్పులో సమస్యలు, ఆటగాళ్ల బ్యాటింగ్ వైఫల్యం, డ్రెస్సింగ్ రూమ్ వివాదాలతోనే సిరీస్ కోల్పోయిందని అంటున్నారు. దీనిపై మీ కామెంట్.
Similar News
News January 7, 2025
హైకోర్టు తీర్పు.. దూకుడు పెంచిన ఏసీబీ
TG: కేటీఆర్ క్వాష్ పిటిషన్ను కోర్టు కొట్టేయడంతో ఏసీబీ దూకుడు పెంచింది. ఫార్ములా-ఈ రేసు కేసుకు సంబంధించి పలు చోట్ల సోదాలు చేపట్టింది. హైదరాబాద్, విజయవాడలోనూ గ్రీన్ కో, ఏస్ జెన్నెక్ట్స్ ఆఫీసుల్లో రికార్డులు పరిశీలిస్తోంది. కోర్టు తీర్పు నేపథ్యంలో నేడు విచారణకు హాజరు కాలేనని కేటీఆర్ తెలపగా ఏసీబీ అనుమతి ఇచ్చింది. విచారణకు ఎప్పుడు రావాలో ఇవాళ క్లారిటీ ఇవ్వనుంది.
News January 7, 2025
జత్వానీ కేసులో IPSలకు ముందస్తు బెయిల్
AP: ముంబై నటి జత్వానీ కేసులో ఐపీఎస్లు, పోలీసులకు హైకోర్టు ఊరట కలిగించింది. IPSలు కాంతిరాణా, విశాల్ గున్నీ, ACP హనుమంతురావు, CI సత్యనారాయణలకు షరతులతో కూడిన ముందస్తు బెయిల్ ఇచ్చింది. విద్యాసాగర్ ఫిర్యాదుతో పోలీసులు తనను వేధించారని జత్వానీ ఆరోపించిన విషయం తెలిసిందే. అయితే తాము నిబంధనల ప్రకారమే నడుచుకున్నామని వారు తెలిపారు.
News January 7, 2025
దేశంలో మరో 2 hMPV కేసులు
hMP వైరస్ దేశంలో నెమ్మదిగా విస్తరిస్తోంది. నిన్నటి వరకు దేశ వ్యాప్తంగా 6 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఇవాళ మహారాష్ట్రలోని నాగపూర్లో ఇద్దరు చిన్నారులు వైరస్ బారిన పడ్డారు. పాజిటివ్ వచ్చిన 7, 13 ఏళ్ల చిన్నారులు దగ్గు, జ్వరంతో బాధపడుతున్నట్లు అధికారులు తెలిపారు. నిన్న చెన్నై, బెంగళూరు, అహ్మదాబాద్, కోల్కతాలో కేసులు నమోదైన విషయం తెలిసిందే.