News March 19, 2024
టీడీపీ ఎంపీ అభ్యర్థులు వీరేనా?
AP: 11 మంది ఎంపీ అభ్యర్థులతో తొలి జాబితా ప్రకటించేందుకు TDP సిద్ధమైనట్లు సమాచారం. శ్రీకాకుళం-రామ్మోహన్ నాయుడు, విజయనగరం-అశోక్ గజపతిరాజు, విశాఖ-భరత్, విజయవాడ-కేశినేని చిన్ని, గుంటూరు-పెమ్మసాని చంద్రశేఖర్, నర్సరావుపేట-లావు శ్రీకృష్ణదేవరాయలు, ఒంగోలు-మాగుంట రాఘవరెడ్డి, నెల్లూరు-వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, అనంతపురం-JC పవన్, హిందూపురం-పార్థసారధి, నంద్యాల-బైరెడ్డి శబరి పేర్లు ఆ జాబితాలో ఉన్నట్లు సమాచారం.
Similar News
News December 28, 2024
జనంలోకి జనసేనాని
AP: కొత్త ఏడాది నుంచి నెలకు ఒక జిల్లాలో పర్యటించాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. ప్రజల మధ్యకు వెళ్లి సమస్యలు తెలుసుకోవాలని భావిస్తున్నారు. ప్రజా సమస్యలు, స్థితిగతులను నేరుగా ఆయనే తెలుసుకోనున్నారు. త్వరలోనే పర్యటన షెడ్యూల్, ఇతర వివరాలను ప్రకటించే అవకాశం ఉంది.
News December 28, 2024
సల్మాన్‌తో నేను డేట్ చేయలేదు: ప్రీతి జింటా
సల్మాన్ ఖాన్‌తో తాను ఎప్పుడూ డేటింగ్ చేయలేదని పంజాబ్ కింగ్స్ ఓనర్ ప్రీతి జింటా తెలిపారు. ఎక్స్‌లో ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు ఆమె ఇలా సమాధానమిచ్చారు. ‘సల్మాన్ నాకు మంచి స్నేహితుడు. నా భర్తకు కూడా ఆయన బెస్ట్ ఫ్రెండ్. మేమెప్పుడూ ఇలాగే ఉంటాం’ అని ఆమె చెప్పుకొచ్చారు. కాగా వీరిద్దరూ కలిసి చోరీ చోరీ చుప్కే చుప్కే, జాన్ ఈ మన్, హర్ దిల్ జో ప్యార్ కరేగా, దిల్ నే జిసా అప్నా వంటి చిత్రాల్లో నటించారు.
News December 28, 2024
రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు బీజేపీ కౌంటర్
మన్మోహన్ సింగ్ అంత్యక్రియలపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను బీజేపీ తిప్పికొట్టింది. రాహుల్ కామెంట్స్ సిగ్గుచేటని మండిపడింది. ఆయన మరీ దిగజారి మాట్లాడుతున్నారని విమర్శించింది. అంత్యక్రియలపైనా రాజకీయాలు చేయడం కాంగ్రెస్ పార్టీకి, రాహుల్ గాంధీకే చెల్లిందని ఎద్దేవా చేసింది. కాంగ్రెస్ అడిగిన మెమోరియల్ నిర్మాణానికి సమయం ఉందని, దానిపై కేంద్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదని పేర్కొంది.