News July 10, 2025
అప్పులపై ప్రశ్నిస్తే దేశద్రోహులమా?: బుగ్గన

AP: రాష్ట్రంలో రూ.2,45,000 కోట్ల బడ్జెట్ ఎక్కడికి పోయిందని YCP నేత బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రశ్నించారు. ప్రభుత్వ అప్పులపై ప్రశ్నిస్తే తాము దేశద్రోహులమా? అని ఆయన నిలదీశారు. హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో ఆయన మాట్లాడారు. ‘రాష్ట్రంలో ఒకటో తేదీన ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి ఉందా? తల్లికి వందనం కొంతమందికే ఇచ్చారు. ఆడబిడ్డ నిధి, అన్నదాత సుఖీభవ, ఉచిత బస్సు ప్రయాణం ఏమయ్యాయి?’ అని ఆయన ఫైర్ అయ్యారు.
Similar News
News July 10, 2025
KCRకు వైద్య పరీక్షలు పూర్తి

TG: BRS అధినేత, మాజీ సీఎం KCRకు వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. సోమాజిగూడ యశోద ఆస్పత్రి నుంచి నందినగర్‌లోని ఆయన నివాసానికి వెళ్లారు. ఈనెల 3న ఆయన అస్వస్థతతో ఆస్పత్రిలో చేరగా ఆరోగ్యం మెరుగ్గానే ఉందని, సోడియం లెవల్స్ కొద్దిగా పెరిగాయని వైద్యులు నిర్ధారించారు. రెండు రోజుల చికిత్స అనంతరం 5వ తేదీన డిశ్చార్జ్ చేశారు. మరోసారి టెస్టుల కోసం రావాలని డాక్టర్లు సూచించడంతో ఇవాళ KCR ఆస్పత్రికి వెళ్లారు.
News July 10, 2025
లగ్జరీ అపార్ట్‌మెంట్ కొన్న జొమాటో ఫౌండర్.. ధర రూ.52.3 కోట్లు!

జొమాటో ఫౌండర్ దీపిందర్ గోయల్ హరియాణాలోని గురుగ్రామ్‌లో ₹52.3కోట్లతో సూపర్ లగ్జరీ అపార్ట్‌మెంట్ కొన్నారు. DLF సంస్థ నిర్మించిన ‘ది కామెల్లియాస్’ రెసిడెన్షియల్ సెక్టార్‌లో ఈ అపార్ట్‌మెంట్ ఉంది. దీని విస్తీర్ణం 10,813 స్క్వేర్ ఫీట్లు. ఇందులో 5 పార్కింగ్ స్పేస్‌లు ఉంటాయి. దీపిందర్ 2022లోనే దీనిని కొనుగోలు చేశారు. ఈ ఏడాది MARలో రిజిస్ట్రేషన్ పూర్తయింది. ₹3.66cr స్టాంప్ డ్యూటీ చెల్లించినట్లు సమాచారం.
News July 10, 2025
BREAKING: ప్రభుత్వం కీలక నిర్ణయం!

TG: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుకు రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. రిజర్వేషన్ల అమలు కోసం అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని భావిస్తున్నారు. ఆ తర్వాత రిజర్వేషన్లపై ఆర్డినెన్స్ తీసుకురావాలని నిర్ణయించినట్లు సమాచారం. మరికాసేపట్లో దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సుమారు 4గంటల పాటు సాగిన మంత్రివర్గ భేటీ ముగిసింది.