News October 28, 2024
ఆ 3 పోర్టులు ప్రైవేట్ పరం?: YCP

AP: రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట పోర్టులను ప్రైవేటు పరం చేసేందుకు సీఎం చంద్రబాబు వేగంగా అడుగులు వేస్తున్నారని YCP ట్వీట్ చేసింది. ‘మూడు పోర్టులను జగన్ సీఎంగా ఉన్నప్పుడు ప్రభుత్వ రంగంలోనే చేపట్టారు. ఇప్పుడు పోర్టులు పూర్తవుతున్న దశలో వాటిని ఆపాలని కమీషన్ల కోసం కూటమి ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. రాష్ట్రంలోని ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేయాలని కంకణం కట్టుకున్నావా చంద్రబాబు’ అని పేర్కొంది.
Similar News
News February 4, 2026
ఫిబ్రవరి 04: చరిత్రలో ఈరోజు

☛ 1891: స్వాతంత్ర్య సమర యోధుడు, లోక్‌సభ మాజీ స్పీకర్ మాడభూషి అనంతశయనం అయ్యంగార్ జననం
☛ 1962: సినీ నటుడు రాజశేఖర్ జననం
☛ 1972: దర్శకుడు శేఖర్ కమ్ముల జననం
☛ 1974: సినీ నటి, పొలిటీషియన్ ఊర్మిళ జననం
☛ 2023: సింగర్ వాణి జయరాం మరణం(ఫొటోలో)
☛ వరల్డ్ క్యాన్సర్ డే
☛ శ్రీలంక స్వాతంత్ర్య దినోత్సవం
News February 4, 2026
స్టీల్ ప్లాంట్ అభివృద్ధికి పూర్తిగా సహకరిస్తాం: చంద్రబాబు

AP: విశాఖ స్టీల్ ప్లాంట్ అభివృద్ధికి ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. ప్లాంట్ పురోగతిపై ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. కొత్త విధానాలతో అన్ని విభాగాల్లో కర్మాగారాన్ని మరింత బలోపేతం చేయాలని సూచించారు. మరోవైపు 2024 సెప్టెంబర్‌లో ఎదుర్కొన్న రూ.486 కోట్ల నష్టాల నుంచి గట్టెక్కి.. 2026 జనవరిలో రూ.54 కోట్ల లాభాన్ని స్టీల్ ప్లాంట్ సాధించింది.
News February 4, 2026
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.


