News April 13, 2024
ఫోన్ ట్యాపింగ్‌లో ఆ నలుగురే కీలకం?
TG: నలుగురు కీలక నేతల ఆదేశాలతో ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు టాస్క్‌ఫోర్స్ మాజీ DCP రాధాకిషన్ రావు రిమాండ్ రిపోర్టులో తెలిసింది. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఓ టాస్క్‌ఫోర్స్ SI సహకారంతో డబ్బులు రవాణా చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. ఎస్కార్ట్ వాహనంలో ఆ డబ్బులను డెలివరీ చేసినట్లు గుర్తించారు. తన చిన్ననాటి మిత్రుడైన ఓ MLCకి రాధాకిషన్ పూర్తిస్థాయిలో సాయం చేసినట్లు పోలీసులు నిర్ధారించారు.
Similar News
News November 16, 2024
దావాలో మైక్రోసాఫ్ట్‌ను చేర్చిన మస్క్
ఓపెన్ ఏఐపై టెస్లా వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ దావా వేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ దావాలోకి మైక్రోసాఫ్ట్‌ను, వెంచర్ క్యాపిటలిస్ట్ రీడ్ హాఫ్‌మ్యాన్‌ను చేర్చారు. ఒకప్పుడు ఆ సంస్థలో ఉన్న మస్క్ 2018లో బయటికొచ్చేశారు. తర్వాత మైక్రోసాఫ్ట్ అందులో 13 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టింది. అయితే, తమ పోటీ ఏఐ యాప్‌లలో పెట్టుబడి పెట్టకుండా ఇన్వెస్టర్లను చాట్ జీపీటీ అడ్డుకుంటోందంటూ మస్క్ కోర్టుకెక్కారు.
News November 16, 2024
నాకు ఐఐటీ చదివే కొడుకున్నాడు: తమన్
సంగీత దర్శకుడు తమన్ తన పుట్టినరోజు సందర్భంగా పలు ఆసక్తికర విషయాల్ని పంచుకున్నారు. తన కుమారుడు ఐఐటీలో చదువుతున్నారని వెల్లడించారు. ‘మా అబ్బాయి ఐఐటీలో ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. నా సోషల్ మీడియా ఖాతాలను, సంగీత సంబంధిత వ్యవహరాలను నా భార్యే చూసుకుంటుంది. నాకు డబ్బు కావాలన్నా తననే అడుగుతాను. మా కుటుంబమంతా ఇప్పుడిప్పుడే హైదరాబాద్‌కు షిఫ్ట్ అవుతున్నాం’ అని తెలిపారు.
News November 16, 2024
జో బైడెన్‌లాగే మోదీకీ మతిపోయిందేమో: రాహుల్
అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్‌లానే ప్రధాని మోదీకి మెమరీ లాస్ అయిందని LoP రాహుల్ గాంధీ సెటైర్ వేశారు. ‘మోదీజీ స్పీచ్ విన్నట్టు నా చెల్లి నాతో చెప్పింది. ఈ మధ్యన మేమేం మాట్లాడినా ఆయనా అదే చెప్తున్నారని పేర్కొంది. బహుశా ఆయనకు మెమరీ లాస్ అయిందేమో. జోబైడెన్ సైతం జెలెన్ స్కీ వస్తే రష్యా ప్రెసిడెంట్ పుతిన్ వచ్చినట్టు చెప్పారు. ఆయనలాగే మన ప్రధానికీ మతి పోయిందేమో’ అని మహారాష్ట్ర సభలో అన్నారు.