News December 30, 2024
సినిమాల్లో ఎప్పుడూ ఆ పాటలేనా?: అనంత శ్రీరామ్
ప్రస్తుత సినిమాల్లో సమాజహితమైన పాటలకు చోటు దక్కడంలేదని సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్ ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల్లో ఆయన మాట్లాడారు. ‘హీరో ఇంట్రడక్షన్, డ్యూయెట్లు, హీరో ఫైట్లకి ఎలివేషన్ సాంగ్స్, లాస్ట్లో ఐటెమ్ సాంగ్స్.. ఇవి తప్ప అర్థవంతమైన పాటలేవీ సినిమాల్లో ఉండట్లేదు. అదృష్టవశాత్తూ ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలో గురువుపై పాట రాసే అవకాశం దక్కింది’ అని తెలిపారు.
Similar News
News January 2, 2025
అమరావతి నిర్మాణం పూర్తైతే సినిమాలన్నీ ఏపీలోనే: సీఎం చంద్రబాబు
AP: తెలుగు చిత్ర పరిశ్రమ త్వరలోనే రాష్ట్రానికి వస్తుందని CM చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. ‘సినిమాలకు ఓవర్సీస్ మార్కెట్ పెరిగింది. అమరావతి నిర్మాణం పూర్తైతే ఇక సినిమాలన్నీ APలోనే. ఇక్కడ సినిమాలకు మంచి మార్కెట్ ఉంటుంది’ అని పేర్కొన్నారు. తప్పుడు పనులు చేయొద్దని ఎమ్మెల్యేలను తాను పదేపదే హెచ్చరిస్తున్నట్లు తెలిపారు. జగన్ చేసిన పాపాలన్నింటినీ ఒక్కొక్కటిగా సరిచేస్తున్నామని సీఎం వ్యాఖ్యానించారు.
News January 2, 2025
రాజమౌళి-మహేశ్ మూవీ.. ఏ హడావిడీ లేకుండా?
SSMB29 మూవీ షూటింగ్ నేడు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. అయితే, ముహూర్తం బాగుండటంతోనే నేడు ముహూర్తం షాట్ తీయనున్నారని, ప్రధాన షెడ్యూల్స్ అప్పుడే స్టార్ట్ కావని తెలుస్తోంది. తక్కువమంది సిబ్బందితో, మీడియా కవరేజ్, ప్రకటనలూ లేకుండా ముహూర్తం షాట్ను జక్కన్న పూర్తి చేయనున్నట్లు సమాచారం. సంక్రాంతి తర్వాతి నుంచే కీలక అప్డేట్స్ విడుదల చేస్తారని సినీవర్గాలు చెబుతున్నాయి.
News January 2, 2025
న్యూ ఓర్లాన్స్ ట్రక్కు దాడి ఉగ్రచర్యే: ఎఫ్బీఐ
నూతన సంవత్సర వేడుకల సమయంలో అమెరికాలోని న్యూ ఓర్లాన్స్లో జరిగిన ట్రక్కు దాడిని ఉగ్రచర్యగా భావిస్తున్నట్లు అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్బీఐ ప్రకటించింది. తొలుత ట్రక్కుతో జనాన్ని ఢీ కొట్టిన నిందితుడు ఆ తర్వాత తుపాకీతో కాల్పులు ప్రారంభించాడు. ఈ దారుణ ఘటనలో 10మంది మృతిచెందగా 35మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల కాల్పుల్లో నిందితుడు హతమయ్యాడు.