News May 2, 2024

భారత్‌ను ఇరకాటంలో పెట్టేందుకే ఆ కథనాలా?- 2/2

image

ఇద్దరు భారతీయ గూఢచారులను ఆసీస్ ప్రభుత్వం దేశం విడిచి వెళ్లిపోమందని ‘ది ఆస్ట్రేలియన్’, ‘ది సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్’ సంస్థలు మంగళవారం పేర్కొన్నాయి. 2020లో ఓ స్పై నెట్‌వర్క్‌ను ఆస్ట్రేలియా ఇంటెలిజెన్స్ ఛేదించగా ఇందులో భారత్ హస్తం ఉందని తేలినట్లు ABC నెట్‌వర్క్ వెల్లడించింది. అంతకుముందు US మీడియా సైతం ఖలిస్థాన్ వేర్పాటువాది పన్ను హత్యకు భారత్ ప్రయత్నించిందని ఆరోపించింది.

Similar News

News March 14, 2026

సూర్య కొత్త సినిమాపై అప్డేట్

image

సూర్య-వెంకీ అట్లూరి కాంబోలో తెరకెక్కుతున్న ‘విశ్వనాథ్ & సన్స్’ మూవీ టీజర్‌ను ఈ నెల 16న సా.4.06 గంటలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రం జులైలో ప్రేక్షకుల ముందుకు రానుంది. సూర్యకు జోడీగా మమిత బైజు నటిస్తుండగా రాధిక, రవీనా టాండన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. GV ప్రకాశ్ మ్యూజిక్ అందిస్తున్నారు.

News March 14, 2026

సోదరిని 84 సార్లు కత్తితో పొడిచి చంపేశాడు!

image

తనతో పాటు పుట్టిన సోదరిని ఓ వ్యక్తి కిరాతకంగా చంపిన ఘటన UPలో జరిగింది. కవల సోదరి హిమాన్షిక(25)తో పాటు హార్దిక్ ఏడాదిన్నర కిందటి వరకు ఇంజినీర్‌గా పనిచేసేవాడు. జాబ్ మానేశాక SMలో ఎక్కువ టైమ్ గడపడం, ఓ అమ్మాయిని లవ్ చేస్తున్న విషయంలో సోదరుడిని హిమాన్షిక మందలించింది. కక్ష పెంచుకున్న అతను సోదరిపై 84సార్లు కత్తితో పొడిచి చంపాడు. ఆపై సర్‌ప్రైజ్ అంటూ తల్లికి డెడ్‌బాడీ చూపించి ఆమెపైనా దాడి చేశాడు.

News March 14, 2026

IPL.. ధోనీ స్థానంలో సంజూ కీపింగ్ చేయాలి: రైనా

image

ఈ ఏడాది ఐపీఎల్‌లో CSKకు ధోనీ స్థానంలో సంజూ శాంసన్ వికెట్ కీపింగ్ చేస్తే బాగుంటుందని మాజీ క్రికెటర్ సురేశ్ రైనా అభిప్రాయపడ్డారు. అలాగే ఓపెనర్‌గా కాకుండా ఆయనను మూడో స్థానంలో ఆడించాలని మేనేజ్‌మెంట్‌కు సూచించారు. ‘ఓపెనర్లుగా రుతురాజ్, ఆయుష్ మాత్రేను పంపించాలి. 4 ,5 స్థానాల్లో బ్రెవిస్, శివమ్ దూబే, ఆరో ప్లేస్‌లో ప్రశాంత్/అకేల్ హోసేన్/నూర్ అహ్మద్‌లలో ఎవరిని తీసుకుంటారో వేచిచూడాలి’ అని పేర్కొన్నారు.