News November 23, 2024
ఆ ఇద్దరే అసలైన వారసులా?

MHలో Political Equations మారిపోయాయి. NCP, శివసేనలో వచ్చిన చీలికలపై ప్రజలు తీర్పు చెప్పేశారు. 51 సీట్లలో శివసేన షిండే-ఉద్ధవ్ వర్గాలు, 37 చోట్ల NCP అజిత్-శరద్ పవార్ వర్గాలు పోటీపడ్డాయి. మొత్తంగా 81 స్థానాల్లో పోటీ చేసిన శిండే వర్గం 57 చోట్ల, అజిత్ వర్గం 59 సీట్లకు 41 చోట్ల సత్తాచూపాయి. 95 సీట్లలో పోటీ చేసిన ఉద్ధవ్ వర్గం 20 చోట్ల, పవార్ వర్గం 86కు 10 చోట్ల విజయం సాధించాయి.
Similar News
News March 4, 2026
భయం పుట్టించే B-2 తయారీలో ఇండో-అమెరికన్!

ప్రపంచంలో భయంకరమైన యుద్ధ ఆయుధాల్లో <<19277612>>B-2<<>> బాంబర్ టాప్‌లో ఉంటుంది. దీని తయారీలో భారత సంతతికి చెందిన నోషిర్ గొవాడియాది కీలకపాత్ర. 1944లో బాంబేలో జన్మించిన ఈయన USకు వెళ్లి ఏరోనాటికల్ ఇంజినీరింగ్ చదివారు. నార్త్‌రోప్ గ్రుమ్మన్ కంపెనీలో డిజైన్ ఇంజినీర్‌గా చేరారు. B-2 బాంబర్లు శత్రువుల రాడార్లకు కనబడకుండా స్పెషల్ డిజైన్ చేశారు. చైనాకు దీని సమాచారం ఇచ్చారని US కోర్టు 2010లో 32 ఏళ్ల జైలుశిక్ష విధించింది.
News March 4, 2026
రాజ్యసభ రేసు: రాష్ట్ర కాంగ్రెస్‌లో ఉత్కంఠ

TG: రాష్ట్ర నుంచి రాజ్యసభ సభ్యుల ఎంపిక ప్రక్రియ కాంగ్రెస్‌లో ఉత్కంఠగా మారింది. 1 స్థానం సింఘ్వీకి ఖరారైనట్లే. రెండో ప్లేస్‌కు వేం నరేందర్ రెడ్డి కోసం CM రేవంత్ పట్టుబడుతుండగా, తనకు అవకాశమివ్వాలని ప్రియాంక గాంధీ ద్వారా AICC కార్యదర్శి వంశీచంద్ రెడ్డి ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా రమణ నాయక్ పేరు తెరపైకి వచ్చింది. రమణ నాయక్ CMకు సన్నిహితుడే. TDP అధినేత CBNతోనూ ఆయనకు మంచి సంబంధాలున్నాయి.
News March 4, 2026
సౌత్ ఇండియన్ బ్యాంక్‌లో ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులు

సౌత్ ఇండియన్ బ్యాంక్ ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. VAPT, ITGC ఆడిటర్, RED టీమ్ లీడ్ పోస్టులు ఉన్నాయి. BSc, BTech/BE అర్హతతో పాటు పని అనుభవం గలవారు మార్చి 9 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 35ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. షార్ట్ లిస్టింగ్, ప్రిలిమినరీ/ పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: recruit.southindianbank.bank.in


