News August 19, 2025

ట్రైన్ టికెట్లు బుక్ అవుతున్నాయా?

image

IRCTC వెబ్‌సైట్, మొబైల్ యాప్‌లో ట్రైన్ టికెట్లు బుక్ అవ్వట్లేదని పలువురు SMలో పోస్ట్ చేస్తున్నారు. ఇవాళ ఉదయం నుంచి లాగిన్, బుకింగ్స్‌ సమస్య నెలకొందని చెబుతున్నారు. పేమెంట్స్ ఫెయిల్ అవుతున్నాయని, ఎర్రర్ మెసేజెస్ వస్తున్నాయని రిపోర్ట్ చేస్తున్నారు. IRCTC డౌన్ అయిందని పలు ట్రాకింగ్ ప్లాట్‌ఫామ్స్ కూడా వెల్లడించాయి. అయితే దీనిపై ఇప్పటివరకు సంస్థ నుంచి అధికారిక ప్రకటన రాలేదు. మీకూ ఈ సమస్య ఎదురైందా?

Similar News

News August 19, 2025

‘ఇంకేముంది.. అంతా అయిపోయింది’.. హరీశ్ రావు ఫొటోకు మంత్రి క్యాప్షన్

image

TG: ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ఫొటో ఎగ్జిబిషన్‌లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. అక్కడ ప్రదర్శించిన ఫొటోలను పరిశీలించిన ఆయన తనదైన శైలిలో స్పందించారు. ఓ ఫొటోలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు హావభావాలు ‘ఇంకేముంది.. అంతా అయిపోయింది’ అన్నట్లుగా ఉన్నాయని సెటైర్ వేశారు. ఈ ఫొటో తీసిన కెమెరామెన్‌ ప్ర‌త్యేక క‌న్సోలేష‌న్ బ‌హుమ‌తి అందుకున్నారు.

News August 19, 2025

ప్రభాస్ మూవీలను దాటేసిన చిన్న సినిమా

image

యానిమేషన్ వండర్ ‘మహావతార్ నరసింహ’ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోంది. హిందీలో ఈ మూవీ సాహో(రూ.150 కోట్లు), సలార్(రూ.153 కోట్లు) లైఫ్ టైమ్ కలెక్షన్లను దాటేసింది. 25 రోజుల్లో రూ.160 కోట్ల వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద గర్జిస్తోంది. ఇలాగే కొనసాగితే త్వరలోనే రూ.200 కోట్లు దాటొచ్చని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అటు ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్ల వసూళ్లకు చేరువైంది.

News August 19, 2025

రోహిత్, కోహ్లీ.. ప్రాక్టీస్ మొదలెట్టారు!

image

భారత స్టార్ క్రికెటర్స్ రోహిత్, విరాట్ ప్రాక్టీస్ మొదలుపెట్టారు. మాజీ క్రికెటర్ అభిషేక్ నాయర్‌ ఆధ్వర్యంలో రోహిత్ జిమ్‌లో కసరత్తు చేస్తున్న ఫొటో వైరలవుతోంది. మరోవైపు విరాట్ లండన్‌లో ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో ఫ్యాన్‌తో దిగిన సెల్ఫీ SMలో హాట్ టాపిక్‌‌గా మారింది. ‘వరల్డ్ కప్ వేట మొదలైంది’ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. వీరిద్దరూ AUSతో OCT 19న స్టార్ట్ కానున్న ODI సిరీస్‌లో ఆడే అవకాశముంది.