News October 3, 2025

విజయ్, రష్మిక ఎంగేజ్‌మెంట్ అయిందా?

image

విజయ్ దేవరకొండ, రష్మిక ఎంగేజ్‌మెంట్ చేసుకున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. పలువురు నెటిజన్లు వారికి విషెస్ తెలియజేస్తున్నారు. దీనిపై వారిద్దరి నుంచి ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన రాలేదు. విజయ్, రష్మిక ప్రేమలో ఉన్నట్లు గతంలోనూ ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ కలిసి గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాల్లో నటించారు.

Similar News

News October 4, 2025

మంగళగిరి వద్ద ROB నిర్మాణానికి రైల్వే ఆమోదం

image

AP: మంగళగిరి-కృష్ణా కాలువ స్టేషన్ల మధ్య రూ.112 కోట్లతో ఆర్వోబీ నిర్మాణానికి రైల్వే శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మంగళగిరి డాన్‌బాస్కో స్కూల్ సమీపంలో ఈ నిర్మాణం జరగనుంది. జాతీయ రహదారి నుంచి రాజధాని E13 రోడ్డును కలుపుతూ వంతెన నిర్మాణానికి డిజైన్ చేశారు. భవిష్యత్ అవసరాల దృష్ట్యా 6 లైన్ల ROB నిర్మాణానికి రైల్వే శాఖ ఆమోదం తెలిపింది.

News October 4, 2025

ఈ రోజు నమాజ్ వేళలు (అక్టోబర్ 04, శనివారం)

image

✒ ఫజర్: తెల్లవారుజామున 4.55 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.07 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.05 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.23 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6.02 గంటలకు
✒ ఇష: రాత్రి 7.15 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News October 4, 2025

భారత్‌లో తాలిబన్ మంత్రి పర్యటనకు లైన్ క్లియర్

image

అఫ్గానిస్థాన్ విదేశాంగ మంత్రి ఆమిర్ ఖాన్‌పై ట్రావెల్ బ్యాన్‌ను UNSC తాత్కాలికంగా ఎత్తేసింది. తాలిబన్ నేతలపై బ్యాన్ అమల్లో ఉండగా దౌత్యం, అత్యవసర అంశాల్లో మినహాయింపునిచ్చింది. దీంతో ఆయన ఈనెల 9-16 మధ్య భారత్‌లో పర్యటించేందుకు లైన్ క్లియరైంది. 2021లో అఫ్గానిస్థాన్‌లో అధికారం చేపట్టిన తర్వాత భారత్‌లో తాలిబన్ నేత పర్యటించడం ఇదే తొలిసారి. ఇరు దేశాల దౌత్య సంబంధాలు, ట్రేడ్‌పై చర్చ జరిగే అవకాశముంది.