News August 20, 2024
‘మాకు టాయిలెట్ల బాధ్యతలా?’.. సచివాలయ ఉద్యోగుల ఆగ్రహం
AP: ప్రభుత్వ పాఠశాలల్లోని టాయిలెట్ల ఫొటోల <<13896129>>అప్‌లోడ్<<>> బాధ్యతలను తమకు అప్పగించడంపై గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది మండిపడుతున్నారు. విద్యాశాఖతో సంబంధం లేని తమకు ఆ డ్యూటీలు అప్పగించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఈ నిర్ణయాన్ని పున:సమీక్షించుకోవాలని మంత్రి నారా లోకేశ్‌ను ఎంప్లాయిస్ అసోసియేషన్ కోరింది. ప్రభుత్వం స్పందించకపోతే బాత్‌రూమ్ కడుగుతూ నిరసన తెలియజేస్తామని తెలిపారు.
Similar News
News January 23, 2025
భారత్‌తో ద్వైపాక్షిక ఒప్పందాలకు USA ప్రాధాన్యం: జైశంకర్
భారత్‌తో ద్వైపాక్షిక ఒప్పందాలకు అమెరికా ప్రాధాన్యం ఇస్తోందని విదేశాంగ మంత్రి జైశంకర్ అన్నారు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి ఆ దేశ విదేశాంగ కార్యదర్శి మార్కో రుబియోతో భేటీ అయిన జైశంకర్ మాట్లాడారు. ద్వైపాక్షిక ఒప్పందాలతో పాటు భారత్‌తో బంధాన్ని బలపరుచుకోవడానికి USA ఇష్టపడుతోందని తన పర్యటనలో అర్థమైందన్నారు. ట్రంప్ ప్రమాణ స్వీకారానికి భారత్ తరఫున జైశంకర్ హాజరయ్యారు.
News January 23, 2025
అభిషేక్ శర్మ బాల్ ఎక్సర్‌సైజ్ గమనించారా?
కోల్‌కతాలో జరిగిన తొలి T20లో ఓపెనర్ అభిషేక్ శర్మ ఊచకోత కోశాడు. 34బంతుల్లోనే 8 సిక్సులు, 5 ఫోర్లతో 79 పరుగులు చేసి భారత్‌ను గెలిపించిన విషయం తెలిసిందే. కాగా, బ్యాటింగ్‌కు రావడానికి ముందు అభిషేక్ బంతితో చేసిన ఎక్సర్‌సైజ్ SMలో వైరల్‌గా మారింది. బంతి సీమ్‌ను వివిధ పొజిషన్లలో చూస్తూ చేసిన ఈ ప్రాక్టీస్ బ్యాటింగ్ చేసే సమయంలో ఊపయోగపడింది. మ్యాచ్‌లో ఈ బాల్ ఎక్సర్‌సైజ్ గమనించి ఉంటే COMMENT చేయండి.
News January 23, 2025
వృథా ఖర్చులు తగ్గించుకోండిలా!
ఆర్థిక క్రమశిక్షణ లేకపోతే అత్యవసర సమయాల్లో జీవితాలు అతలాకుతలం అవుతాయి. అందుకే వృథా ఖర్చులను ఎప్పటికప్పుడు తగ్గించుకోవాలి. వచ్చిన జీతం లేదా ఆదాయాన్ని 50:30:20 రూల్ ప్రకారం కేటాయించడం మంచిది. 50% డబ్బు అద్దె, ఆహారం, తదితరాలు.. 30% కోరికలు, టూర్‌లు.. 20% పొదుపు చేస్తే వృథా ఖర్చు తగ్గుతుంది. అలాగే, ఒక వస్తువును చూడగానే కొనాలని అనిపిస్తే 24 గంటల పాటు ఆగి, అప్పటికీ అవసరం అనుకుంటేనే కొనండి.