News October 7, 2025
మహిళలూ ఒంటరిగా క్యాబ్‌లో ప్రయాణిస్తున్నారా?

ప్రస్తుతకాలంలో వృత్తి, ఉద్యోగాల కారణంగా మహిళలు క్యాబ్స్‌లో ప్రయాణించడం ఎక్కువైంది. అయితే ఇలాంటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. డ్రైవర్ ఐడీ, నంబర్ ప్లేట్ చెక్ చేయాలి. ట్రిప్ వివరాలు సన్నిహితులకు పంపడం మంచిది. గుర్తింపు ఉన్న క్యాబ్ సర్వీసులనే ఎంచుకోవాలి. పరిసరాలు, రూట్ గమనిస్తూ అలర్ట్‌గా ఉండాలి. బ్యాక్ సీట్‌లో కూర్చుంటే విజిబులిటీ బావుంటుంది. తెలియనివారికోసం డోర్లు తెరవకూడదు.
Similar News
News April 1, 2026
కేరళం బీజేపీ మ్యానిఫెస్టోలో సంక్షేమానికి పెద్ద పీట

కేరళం ఓటర్లను ఆకర్షించేందుకు సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తూ BJP మ్యానిఫెస్టో ప్రకటించింది. మహిళలు, వితంతువులు, 70ఏళ్లుపైబడిన వృద్ధులకు నెలకు ₹3వేల పెన్షన్ అందిస్తామంది. ప్రతిఇంటికీ నెలకు 20వేల లీటర్ల ఉచిత తాగునీరు, ఓనమ్-క్రిస్మస్ పండగల కోసం పేదలకు ఏటా ఫ్రీగా రెండు LPG సిలిండర్లు ఇస్తామంది. మందులు, నిత్యావసర సరుకులపై పేద మహిళలకు ‘భక్ష్య ఆరోగ్య సురక్ష’ కార్డుతో ప్రతీనెల ₹2500 రీఛార్జ్ ఆఫర్ చేసింది.
News April 1, 2026
‘ధురంధర్-2’ స్టోరీ నాదే.. కాపీ కొట్టారు: కన్నడ డైరెక్టర్

బాక్సాఫీసును షేక్ చేస్తున్న ‘ధురంధర్-2’కు ఇప్పుడు కొత్త వివాదం చుట్టుకుంది. తన స్టోరీనే కాపీ కొట్టి సినిమా తీశారని కన్నడ డైరెక్టర్ ఆర్ఎస్ సంతోష్ కుమార్ ఆరోపించారు. 2023లోనే స్క్రిప్ట్‌ను రిజిస్టర్ చేయించానని.. టీ-సిరీస్, ధర్మ ప్రొడక్షన్స్, సోనీ పిక్చర్స్ వంటి బడా నిర్మాణ సంస్థలకు కథ వినిపించానని తెలిపారు. ఇటీవల సినిమా చూడటంతో విషయం తెలిసిందని.. దీనిపై చట్టపరంగా ముందుకెళ్తానని పేర్కొన్నారు.
News April 1, 2026
అర్షదీప్ సింగ్ ఖాతాలో చెత్త రికార్డు

IPL: ఈ సీజన్ తొలి మ్యాచ్‌లోనే పంజాబ్ కింగ్స్ బౌలర్ అర్షదీప్ సింగ్ చెత్త రికార్డు మూటగట్టుకున్నారు. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తన చివరి ఓవర్‌లో అర్షదీప్ ఏకంగా 11 బంతులు వేశారు. దీంతో ఐపీఎల్‌లో సుదీర్ఘ ఓవర్ వేసిన ఆరో బౌలర్‌గా నిలిచారు. ఇప్పటికే తుషార్ దేశ్‌పాండే (CSK), సిరాజ్ (RCB), హార్దిక్ పాండ్య (MI), సందీప్ శర్మ (RR), శార్దూల్ థాకూర్ (LSG) పేరిట ఈ రికార్డ్ ఉంది.


