News December 2, 2024
మహిళలు ఏమైనా కుందేళ్లా..?.. మోహన్ భాగవత్‌పై రేణుకా చౌదరి ఫైర్

ప్రతి ఒక్కరూ ముగ్గుర్ని కనాలన్న RSS చీఫ్ మోహన్ భాగవత్‌కు MP రేణుకా చౌదరి కౌంటర్ ఇచ్చారు. పిల్లల్ని కంటూ పోవడానికి మహిళలు ఏమైనా కుందేళ్లా? అని నిలదీశారు. ఈ రోజుల్లో ఉద్యోగం లేని వారికి పిల్లని ఇచ్చేందుకు ఎవరూ సిద్ధంగా లేరన్నారు. ‘ఉపాధి లేదు. డబ్బు లేదు. అయినా ఎక్కువ మందిని కనాలంటున్నారు. చెప్పేవాళ్లు ఎంతమందిని పోషించగలరు? వారి అనుభవం ఏంటి?’ అని ఆమె ప్రశ్నించారు.
Similar News
News March 15, 2026
100 కుక్కలకు విషం పెట్టి చంపేశారు

TG: మంచిర్యాల జిల్లాలో 100 వీధికుక్కలకు విషం పెట్టి చంపిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ నెల 7-8 తేదీల్లో జన్నారం మం. కిష్టాపూర్‌లో ఈ ఘటన జరిగింది. సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి కుక్కలను చంపేందుకు ఇద్దరిని నియమించుకున్నారు. వారు కుక్కలకు విషపూరిత ఇంజెక్షన్లు ఎక్కించారు. అవి చనిపోయాక కళేబరాలను ఓ నది ఒడ్డున పూడ్చి పెట్టారు. జంతు సంక్షేమ కార్యకర్త ఫిర్యాదుతో పోలీసులు సర్పంచ్, PSపై కేసు నమోదు చేశారు.
News March 15, 2026
దుబాయ్‌లోనే ఉంటాం: విదేశీయులు

యుద్ధంలో దుబాయ్ నష్టపోతున్నా అక్కడ నివసిస్తున్న విదేశీయులు ఆ దేశంపై నమ్మకం చూపిస్తున్నారు. ఇప్పటికే ఇరాన్ దుబాయ్‌పై 300 మిస్సైళ్లు, 1,567 డ్రోన్లను ప్రయోగించింది. వీటిలో 90% ఆయుధాలను UAE అడ్డుకుంది. అయితే వాటి శిథిలాలు జనావాసాలు, వ్యాపార భవంతులపై పడ్డాయి. దుబాయ్ పాలకులపై నమ్మకం ఉందని, వారు తమను రక్షిస్తున్నారని ఇతర దేశస్థులు చెప్పారు. దుబాయ్ చాలా సురక్షితమైన నగరమని, వదిలే ఉద్దేశం లేదని తెలిపారు.
News March 15, 2026
యుద్ధం.. మరో జలసంధి క్లోజ్?

ప్రపంచ వాణిజ్యానికి కీలకమైన ‘బాబ్ ఎల్-మండేబ్’ జలసంధిని హౌతీలు మూసివేసే అవకాశం ఉందని హెచ్చరికలు వస్తున్నాయి. ఇప్పటికే హార్ముజ్ మూతపడటంతో గ్యాస్, చమురు సరఫరా అస్తవ్యస్తమైంది. ఇప్పుడు ఈ మార్గం కూడా క్లోజ్ అయితే 30% గ్లోబల్ ట్రేడ్‌పై ప్రభావం పడుతుంది. యూరప్ నుంచి సూయెజ్ కెనాల్ మీదుగా ఇండియా సహా ఆసియాకు వచ్చే నౌకలన్నీ నిలిచిపోతాయి. ఫలితంగా ఇంధన, వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకే అవకాశం ఉంది.


