News February 5, 2025

చికెన్ తినడానికి భయపడుతున్నారా?

image

APలోని కొన్నిచోట్ల కోళ్లు చనిపోతున్న <<15366175>>ఘటనలపై <<>>పశుసంవర్ధక శాఖ అధికారులు స్పందించారు. ఈ ఘటనలతో కోళ్లు, గుడ్లు తినేందుకు ప్రజలు సంకోచిస్తుండటంతో వీటి వినియోగం వల్ల అనారోగ్యం సంభవించినట్లు ఎక్కడా నిర్ధారణ కాలేదన్నారు. ప్రజలు అపోహలకు గురికావొద్దని, ఉడికించిన గుడ్లు, చికెన్ తీసుకోవచ్చని సూచించారు. కొల్లేరు సరస్సుకు ఈ ఏడాది వలస పక్షులు అధికంగా రావడం కూడా ఆ సమీపంలో కోళ్ల మృతికి కారణంగా భావిస్తున్నారు.

Similar News

News January 9, 2026

చరిత్ర సృష్టించిన రుతురాజ్

image

లిస్టు-A క్రికెట్‌లో రుతురాజ్ గైక్వాడ్ సరికొత్త చరిత్ర సృష్టించారు. అత్యధిక బ్యాటింగ్ యావరేజ్(58.83) నమోదుచేసిన ఆటగాడిగా నిలిచారు. ఇతను 99 మ్యాచ్‌లలో 5,060 రన్స్ చేశారు. ఇందులో 20 సెంచరీలు, 19 హాఫ్ సెంచరీలున్నాయి. ఆ తర్వాతి స్థానాల్లో బెవాన్(57.86), హెయిన్(57.76), కోహ్లీ(57.67) ఉన్నారు. అలాగే విజయ్ హజారే ట్రోఫీలో అతి తక్కువ(59) మ్యాచుల్లో 15 శతకాలు బాదిన ప్లేయర్‌గా రుతురాజ్ రికార్డుల్లోకెక్కారు.

News January 9, 2026

HYD-VJA హైవేపై ప్రయాణిస్తున్నారా?

image

హైదరాబాద్-విజయవాడ హైవేపై ప్రయాణించేవారికి గుడ్ న్యూస్. ఇకపై ఈ మార్గంలోని టోల్ గేట్ల వద్ద వాహనాలు ఆగకుండా ప్రయాణించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. చౌటుప్పల్ సమీపంలోని పంతంగి టోల్ గేట్ వద్ద శాటిలైట్ ద్వారా టోల్ ఫీజు వసూల్ కోసం హైవే అధికారులు ట్రయల్ నిర్వహించారు. పూర్తి స్థాయిలో శాటిలైట్ విధానం అమల్లోకి వస్తే ఈ రూట్‌లో పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో ట్రాఫిక్ రద్దీ, జామ్ సమస్యలు తీరే అవకాశం ఉంది.

News January 9, 2026

దైవాన్ని ఎలా నమస్కరించాలంటే?

image

గుడికి వెళ్లినప్పుడు దేవుడికి ఎలా నమస్కరించాలో శాస్త్రం స్పష్టంగా చెబుతోంది. చాలామంది గర్భాలయంలోని మూలమూర్తికి ఎదురుగా నిలబడి దండం పెట్టుకుంటారు. కానీ అది సరైన పద్ధతి కాదు. ఒక పక్కకు నిలబడే వేడుకోవాలి. గర్భాలయంలో అర్చకులు కుడివైపున ఉండి పూజలు చేస్తారు కాబట్టి, భక్తులు ఎడమ పక్కన నిలబడిటం మంచిది. అలాగే స్వామికి ఎదురుగా ఉండే నంది, గరుత్మంతుడికి మధ్యలో అడ్డుగా నిలబడకూడదని పండితులు చెబుతుంటారు.